కమెడియన్ నిలబెట్టిన సినిమా
‘మత్తు వదలరా’తో పోలిస్తే ‘మత్తు వదలరా-2’ పకడ్బందీ సినిమా కాకపోయినా.. వేరే విషయాల్లో వీక్ అనిపించినా.. సత్య కామెడీ డోస్‌కు మాత్రం ఢోకా లేకపోయింది.
ఒక సినిమా హిట్టవడానికి అనేక అంశాలు కలిసి రావాలి. ఐతే కొన్ని చిత్రాలు మాత్రం ఎన్ని లోపాలున్నా.. ఏదో ఒక్క ఫ్యాక్టర్ వల్ల బాగా ఆడేస్తుంటాయి. లేటెస్ట్ తెలుగు మూవీ ‘మత్తు వదలరా-2’ కూడా ఈ కోవకే చెందుతుంది. ఐదేళ్ల కిందట వచ్చిన ‘మత్తు వదలరా’కు ఇది సీక్వెల్. పార్ట్-1లో కథ పరంగా ఉన్నంత బిగి, థ్రిల్స్ ఈ సినిమాలో కనిపించవు. కథాకథనాలను మరీ నాన్ సీరియస్‌గా, లాజిక్కుల్లేకుండా నడిపించేశాడు దర్శకుడు రితేష్ రాణా. హీరో శ్రీ సింహా పాత్ర కూడా సరిగా ఎలివేట్ కాలేదు.
విలన్ పాత్ర చాలా వీక్. చివర్లో వచ్చే ట్విస్ట్ కూడా అంతగా పేలలేదు. ఐతే ఇలా మైనస్‌లు ఎన్ని ఉన్నా సరే.. ఒక్క పాత్ర మాత్రం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. కేవలం ఆ పాత్రతో కనెక్ట్ అయితే చాలు సినిమా అస్సలు బోర్ కొట్టదు. ఈ క్యారెక్టర్ కమెడియన్ సత్యదే అని ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది.
‘మత్తు వదలరా’తో పోలిస్తే ‘మత్తు వదలరా-2’ పకడ్బందీ సినిమా కాకపోయినా.. వేరే విషయాల్లో వీక్ అనిపించినా.. సత్య కామెడీ డోస్‌కు మాత్రం ఢోకా లేకపోయింది. ఒకప్పుడు కొందరు స్టార్లు నటించిన సినిమాల్లో కూడా వేరే విషయాలు ఆకట్టుకోలేకపోయినా.. కేవలం బ్రహ్మానందం కామెడీ పేలడం వల్ల అవి బాగా ఆడేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు సత్య కూడా ‘మత్తు వదలరా-2’ను అలాగే నిలబెట్టాడు. ఈ సినిమా చూసిన వాళ్లంతా చెబుతున్నది ఒకటే మాట.. సత్య వన్ మ్యాన్ షో అని. రివ్యూయర్లు కూడా అదే తీర్మానించారు.
తన టిపికల్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతుంది.ఈ సినిమా రిలీజ్ దగ్గర్నుంచి సోషల్ మీడియా అంతా కూడా సత్య పేరే మార్మోగిపోతోంది. తన కామెడీ బిట్స్, చిరు పాట డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలతో సత్యకు ఎలివేషన్లు ఇస్తున్నారు. సత్యను నమ్మి థియేటర్లకు వెళ్లిపోండి, మిగతాది అతను చూసుకుంటాడు అని కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా చూసేందుకు థియేటర్లకు ప్రేక్షకులను పుల్ చేయడంలో సత్యదే అత్యంత కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. ఇలా ఒక కమెడియన్ సినిమాను నిలబెట్టిన సందర్భాలు అరుదుగానే కనిపిస్తాయి.