పక్కకు తప్పుకుంటే ఇండస్ట్రీలో పనైపోయినట్లే!
ఇప్పటికే హిందీ సినిమా 'రామసేతు'లో నటించిన సంగతి తెలిసిందే.
సత్యదేవ్ టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటుల్లో ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమై ఇప్పుడిప్పుడే ప్రధాన పాత్రల వైపు సాగుతున్నాడు. 'గాడ్ ఫాదర్'..'ఆచార్య' లాంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో అవకాశాలు కేవలం తన ప్రతిభతోనే అందు కుంటున్నాడు. అతని నటన మెచ్చి చిరంజీవి కల్పించిన ఛాన్సులవి. 'బ్లఫ్ మాస్టర్' లాంటి సినిమా అతనికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. బాలీవుడ్ లో సైతం అవకాశాలు అందుకునే స్థాయికి ఎదిగాడు. ఇప్పటికే హిందీ సినిమా 'రామసేతు'లో నటించిన సంగతి తెలిసిందే.
అప్పుడప్పుడు తెరపై హీరోగానూ మెప్పిస్తున్నాడు. 'స్కైలాబ్'..'గాడ్సే'..'గుర్తుంతా శీతాకాలం'..అంతకు ముందు పూరి తెరకెక్కించిన 'జ్యోతిలక్ష్మి' లాంటి సినిమాల్లో మెయిన్ లీడ్స్ లో నటించాడు. ' కృష్ణమ్మ..'ఫుల్ బాటిల్' లాంటి చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం సత్యదేవ్, డాలీ ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో 'జీబ్రా' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఇండస్ట్రీలో తన అనుభవాన్ని పంచుకున్నాడు.
పరిశ్ర మలో నిలదొక్కుకోవాలంటే ప్రత్యేకంగా ఏదో ఒకటి చేయాలి. ఏపాత్ర అయినా చేస్తామని నిరూపించు కోగలగాలి. హీరోగానే కాక ఎలాంటి పాత్ర అయిన పోషిస్తాడు? అనే భరోసో అవతలి వారికి కల్పించాలి. ఏ నటుడికైనా అంతిమంగా కావాల్సింది ఒక బ్రేక్. అలాంటి బ్రేక్ ఒకటి వస్తే చాలు. తర్వాత దానందటదే అవకాశాలు వస్తాయి. అలాంటి నాదైన ఒక రోజు వచ్చే వరకూ ట్రాక్ మీద ఎదురు చూస్తూనే ఉండాలి.
అలా కాదని వెళలిపోతే మన పని అయిపోయినట్లే. నేనైతే ఎప్పుడూ ట్రాక్ మీద ఉండేలా చూసుకుంటా. ఇప్పుడు అలాగే నిలబడ్డాను.' నాకంటూ ఓ మంచి శుక్రవారం తగిలినప్పుడు పూర్తిగా హీరో పాత్రలే చేస్తా' అన్నాడు. మొత్తానికి సత్యదేవ్ పూరి జగన్నాధ్ కొటేషన్లు బాగా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. మనం ఎక్కాల్సిన రైలు బండి వచ్చే వరకూ ప్లాట్ ఫాం మీద ఎదురు చూడాల్సిందే. ఆ ట్రైన్ ఇప్పుడు రావొచ్చు...తర్వాత రావొచ్చు...కానీ ఏదో సమయంలో వస్తుంది. అప్పటి వరకూ ఎదురు చూడాలి. రైలు రాలేదని వెళ్లిపోతే గమ్యం చేరడం సాధ్యపడదని పూరి ఓ సందర్భంలో అన్నారు.