జీబ్రా సెన్సార్.. గెట్ రెడీ!

ఇక సత్యదేవ్ ఇప్పుడు హీరోగా మరొక డిఫరెంట్ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Update: 2024-11-19 09:43 GMT

టాలీవుడ్ లో సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయగలిగే హీరోలలో సత్యదేవ్ ఒకరు. అతడు కేవలం హీరోగానే కాకుండా కొన్ని సినిమాలలో మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా చేశాడు. మెగాస్టార్ చిరంజీవి సైతం అతని నటనను చాలాసార్లు మెచ్చుకున్నారు. ఇక సత్యదేవ్ ఇప్పుడు హీరోగా మరొక డిఫరెంట్ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.


టాలీవుడ్ లో సత్యదేవ్ నటించిన తాజా చిత్రం జీబ్రా తాజాగా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. నవంబర్ 22న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తయారైనట్లు తెలుస్తోంది. టీజర్ ట్రైలర్ కూడా ఇదివరకే మంచి హైప్ క్రియేట్ చేశాయి. సత్యదేవ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని స్పష్టమవుతుంది.

లవ్, కామెడీ, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలను పర్ఫెక్ట్ గా మేళవించి దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ ఈ సినిమాను రూపొందించారు. సత్యదేవ్ తన పాత్రలో బలమైన భావోద్వేగాలను ప్రదర్శిస్తూ, ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. కన్నడ స్టార్ డాలీ ధనుంజయ ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రలో నటించారు. టీజర్ లో ఆయన పాత్ర కూడా ఆకర్షణీయంగా కనిపించింది. సత్యదేవ్‌తో కలిసి ఆయన చేసిన సీన్స్ బాగా హైలైట్ అవుతాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ ఇద్దరు స్టార్ నటుల మధ్య స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించనుందని భావిస్తున్నారు.

ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్, సత్యదేవ్ మరియు ధనుంజయ నటన టీజర్ లో ప్రత్యేకంగా నిలిచాయి. ట్రైలర్ ను ఆసక్తిగా కట్ చేయడంతో సినిమా కథను ముందుగానే రివీల్ చేయకుండా, ఆడియన్స్ ను థియేటర్ల వరకు రప్పించే విధంగా ప్లాన్ చేశారు. ఇక సెన్సార్ బోర్డు సినిమాకు ఇచ్చిన U/A సర్టిఫికేట్ ఇచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా కనెక్ట్ అయ్యేలా ఉంటుందని చెబుతున్నారు.

యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, దర్శకుడు అన్ని వర్గాల ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని సినిమాను రూపొందించారు. టీజర్ లోనే కనిపించిన ఎమోషనల్ షేడ్స్ సినిమాలో మరింత ప్రధానంగా ఉండనున్నాయి. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నవంబర్ 22న విడుదల కానుంది. ఇది సత్యదేవ్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. సినిమా విజయం సత్యదేవ్ కు కొత్త మార్కెట్‌ను తెచ్చిపెడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

రవి బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ సినిమాకు అదనపు బలం. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా హై స్టాండర్డ్స్ లో ఉన్నాయని తెలుస్తోంది. అన్ని అంశాలను సమతుల్యంగా మేళవించి జీబ్రా నవంబర్ 22న బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతుంది. మరి ఈ సినిమా కంటెంట్ పరంగా థియేటర్లలో ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

Full View
Tags:    

Similar News