సత్యదేవ్ జీబ్రా.. టీజర్ ఎలా ఉందంటే?

టాలీవుడ్ యాక్టర్ సత్యదేవ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.

Update: 2024-09-30 07:41 GMT

టాలీవుడ్ యాక్టర్ సత్యదేవ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ కెరీర్ స్టార్టింగ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత హీరోగా మారి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, కృష్ణమ్మ, బ్లఫ్ మాస్టర్ వంటి వైవిధ్యభరితమైన సినిమాల్లో యాక్ట్ చేసి మెప్పించారు. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుని సత్తా చాటుతున్నారు. ఇప్పుడు మల్టీస్టారర్ మూవీ జీబ్రాతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.


ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో కన్నడ స్టార్ డాలీ ధనుంజయ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై SN రెడ్డి, S పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల మోషన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే జోష్ తో తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

టీజర్ ప్రకారం.. మూవీలో లవ్ స్టోరీ, కామెడీతో పాటు ఓ థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా ఉండబోతున్నట్టు క్లారిటీగా తెలుస్తుంది. మూవీ స్టోరీ లైన్ రివీల్ చేయకుండా.. ఇంట్రెస్టింగ్ గా టీజర్ ను కట్ చేశారు. మూవీపై హైప్ క్రియేట్ చేశారు. టీజర్ లో సత్యదేవ్ చాలా అట్రాక్టివ్ గా కనిపించారు. వివిధ షేడ్స్ ఉన్న రోల్ లో మూవీలో కనిపించనున్నట్లు ఈజీగా తెలుస్తోంది. మరోసారి తన టాలెంట్ ను నిరూపించుకుంటారని అర్థమవుతుంది.

డాలీ ధనుంజయ కూడా తన పాత్రలో డైనమిక్‌ గా కనిపించారు. సత్యదేవ్ తో కలిసి బ్లాక్ అండ్ వైట్ షేడ్స్‌ లో అలరించారు. సునీల్, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిసినాటో, సత్య రోల్స్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ ప్రతి రోల్ ను పర్ఫెక్ట్ గా రాసుకున్నారు. టీజర్ లో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది.

స్టార్ కాస్టింగ్ తోపాటు సినిమాను రిచెస్ట్ ప్రొడక్షన్స్ వాల్యూస్ తో రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మూవీని అక్టోబర్ 31న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. దీపావళి కానుకగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. సత్యదేవ్ కు ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. మరి ఆయన ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News