'దేవర' ను ఢీ కొట్టే 'సత్యం సుందరం' ఎవరు...?

ఎన్టీఆర్‌ హీరోగా జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'దేవర' సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

Update: 2024-09-12 12:30 GMT

ఎన్టీఆర్‌ హీరోగా జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'దేవర' సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ కీలక పాత్రలో నటించిన దేవర సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో దేవర సినిమాను భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. తమిళనాడులో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థతో కలిసి పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ సమయంలో దేవరకు తెలుగు లోనే ఒక సినిమా పోటీగా నిలువబోతుంది.

సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు వస్తున్నప్పుడు ఆ వారంలో సినిమాలు రాకపోగా, తదుపరి వారం లో చిన్న సినిమాలు విడుదల అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ 'దేవర' విడుదల రోజే 'సత్యం సుందరం' అనే సినిమా విడుదల అవ్వబోతుంది. ఎన్టీఆర్‌ దేవర సినిమాకు ఈ సినిమా ఎంత వరకు పోటీ ఇస్తుందనే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కానీ భారీ ఎత్తున థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసే విధంగా సురేష్ ఏషియన్‌ పంపిణీ సంస్థ ప్లాన్‌ చేస్తోంది. దాంతో దేవర పై కొంతలో కొంత అయినా ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇంతకు ఈ 'సత్యం సుందరం' ఎవరు అనే విషయానికి వస్తే.... కోలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరో కార్తీ హీరోగా సి ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో జ్యోతిక, సూర్య కలిసి నటించిన చిత్రం 'మీయజగన్'. ఈ సినిమా ను తెలుగు లో సత్యం సుందరం టైటిల్ తో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమిళంలో సెప్టెంబర్‌ 27న విడుదల కాబోతున్న ఈసినిమాను తెలుగులో అదే తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇటీవలే సురేష్‌ ఏషియన్‌ సంస్థతో నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం అందుతోంది. అందుకే దేవర సినిమాకు ఈ సినిమా పోటీగా మారే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఎన్టీఆర్‌ 'దేవర' సినిమాకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో అసలు సత్యం సుందరం సినిమా గురించి ఏ ఒక్కరు ఆలోచించే అవకాశం లేదు. ఒక వేళ దేవర సినిమాకు నెగటివ్‌ టాక్‌ వస్తే అప్పుడు రెండు లేదా మూడో రోజు కు కార్తీ సినిమా వైపు ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది. దేవరకు హిట్‌ టాక్‌ దక్కి సత్యం సుందరం సినిమాకు యావరేజ్‌ టాక్‌ వచ్చినా ప్రేక్షకులు కనీసం కార్తీ సినిమాను వారం రోజుల పాటు చూసే అవకాశం లేదు అంటూ బాక్సాఫీస్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనుక దేవర తో సినిమాను విడుదల చేయడం అనేది కచ్చితంగా మంచి నిర్ణయం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే తమిళనాడులో మాత్రం దేవరకు మీయజగన్ చిత్రం వల్ల కాస్త నష్టం తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News