ప్రియురాలు ఎవరు? వెంబడించేది ఎవరు?
అయితే ఈ దొంగ-పోలీస్ గేమ్ లో రణబీర్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ ఎవరు కొట్టేసారు? అన్నది ఆసక్తికరం.
బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ ప్రాజెక్ట్ గా మారిన `ధూమ్-4` కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. యశ్ రాజ్ ఫిలింస్ రణబీర్ కపూర్ ని హీరోగా లాక్ చేసిన దగ్గర నుంచి అందులో ఆయనకు జోడీగా నటించేది? ఎవరు? అంటూ ఎన్నో ఆరాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఈప్రాజెక్ట్ కి కియారా అద్వాణీ, శార్వరీ వాఘ్ని పైనల్ చేసినట్లు సమాచారం. అయితే ఈ దొంగ-పోలీస్ గేమ్ లో రణబీర్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ ఎవరు కొట్టేసారు? అన్నది ఆసక్తికరం. ఇందులో ఒక రోల్ పూర్తిగా రణబీర్ కి యాంటీగా సాగుతుంది.
అంటే పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర. మెయిన్ పోలీస్ పాత్రకు సపోర్ట్ గా ఆ రోల్ ఉంటుంది. అయితే మరో పాత్రని మాత్రం రణబీర్ పాత్రతోనే ట్రావెల్ అయ్యేలా స్క్రిప్ట్ సిద్దం అవుతోందిట. కానీ ఆ హీరోయిన్ ఎవరు? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. మేకర్స్ రివీల్ చేసే వరకూ గానీ క్లారిటీ రాదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉంది. స్టోరీ పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు.
అలాగే ఈ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేసే దర్శకుడు ఎవరు? అన్నది కూడా ఇంతవరకూ క్లారిటీ లేదు. యశ్ రాజ్ ఫిలింస్ టాప్ మేకర్లనే రంగంలోకి దించుతుంది. యాక్షన్ చిత్రాలపై అపార అనుభవం ఉన్న వాళ్లనే తీసు కుంటారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటి వరకూ ఇదే సిరీస్ నుంచి రిలీజ్ అయిన మూడు భాగాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించాయి. దీంతో నాల్గవ భాగాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా ఇంటర్నేషనల్ రీచ్ ఉండేలా యశ్ రాజ్ ఫిలింస్ ప్లాన్ చేస్తోంది.
తెలుగు సినిమా పాన్ ఇండియాని షేక్ చేస్తోన్న వేళ `దూమ్-4`ని బాలీవుడ్ ఓ వెపన్ లా దించుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రాంచైజీకి ఇండియా వైడ్ మంచి డిమాండ్ ఉంది. తాజా సినారేలో బాలీవుడ్ స్టార్లు అంతా ప్రచారం పేరుతో ఇండియా అంతా చుట్టేస్తున్నారు. మునుపటిలా ప్రచారాన్ని కేవలం ముంబై వరకే పరిమితం చేయలేదు. ఈ నేపథ్యంలో దూమ్-4 ని బాలీవుడ్ మరింత ప్రతిష్టాత్మకంగానూ భావిస్తోంది.