తేజ్ డాన్సు పై ఆయనే అసంతృప్తిగా!
తాజాగా వీటి పై తేజ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసాడు. యాక్సిడెంట్ తర్వాత ట్రీట్మెంట్.. మెడిసిన్స్ వల్ల శరీరం లో కొన్ని రాకల ఏర్పడ్డాయి.
'విరూపాక్ష'తో భారీ సక్సెస్ అందుకున్న మెగా మేనల్లుడు సాయితేజ్ రెట్టించిన ఉత్సాహంలో ఉన్న సంగతి తెలిసిందే. అంత కు ముందు వరకూ వరుస పరజయాలు వెంటాడిన తేజ్ ని విరూపాక్ష విజయం మరో స్థాకియి తీసుకెళ్లింది. కెరీర్ లోనే తొలి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడదే రెట్టించిన ఉత్సాహంతో 'బ్రో' సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో మావయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకకాశం రావడంతో తేజ్ ఆనందానికి అవదుల్లేవ్.
'బ్రో'తోనూ సక్సెస్ అందుకుని స్టార్ గా తన స్టామినా చాటాల ని చూస్తున్నాడు. ఈ సినిమా లో డాన్సులు చేయడానికి స్కోప్ ఉన్న చిత్రం కావడంతో తేజ్ డాన్సులు ఇరగదీసే ఉంటాడని అంతా భావిస్తున్నారు. అయితే ఇప్పటికే లీకైన కొన్ని మూవ్ మెంట్స్ తో అభిమానులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. మునుపటిలా తేజ్ లో ఎనర్జీ మిస్ అయిందని... డాన్సుల్లో కళ తప్పిందని నెగిటివ్ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా వీటి పై తేజ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసాడు. యాక్సిడెంట్ తర్వాత ట్రీట్మెంట్.. మెడిసిన్స్ వల్ల శరీరం లో కొన్ని రాకల ఏర్పడ్డాయి. నా డాన్సు మీకే కాదు..నాకే నచ్చడం లేదు. అభిమానుల్ని ఆ రకంగా బాధ పెడుతుందన్నందుకు సారీ. శరీరం లో అన్ని భాగాలు సునాయాసంగా కదిపే వెసులు బాటు నాకు ఇంకా రాలేదు. అందుకు సమయం పడుతుంది.
అప్పుడు కచ్చితంగా మీ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా డాన్సులు చేస్తాను. యాక్సిడెంట్ అయిన తర్వాత కొన్ని రోజుల పాటు మాట కూడా రాలేదు. మళ్లీ నాకు అమ్మ చిన్నపిల్లాడిలా దగ్గరుండి మాటలు నేర్పించింది. కోమా లో ఉన్నప్పుడు స్టెరాయిడ్స్ ఇచ్చారు.
అవి నా శరీరం పై తీవ్ర ప్రభావం చూపాయి. ఫిట్ నెస్ కోల్పోయాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను' అని అన్నారు. ఇక తేజ్ మంచి డాన్సర్. మెగా ఫ్యామిలీ లో చిరంజీవి..రామ్ చరణ్ ..బన్నీ తర్వాత ఆ రేంజ్ లో డాన్సులు చేయగల సమర్దుడు. తేజ్ డాన్సుని పవన్ కూడా మెచ్చిన సందర్భాలున్నాయి.