'రామ్ చరణ్' పేరు వెనక అంత మర్మం ఉందా?
ఇన్నాళ్లుగా మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్.. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ .. అంటూ అభిమానంగా పిలుచుకుంటున్నాం.
ఇన్నాళ్లుగా మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్.. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ .. అంటూ అభిమానంగా పిలుచుకుంటున్నాం. రామ్ చరణ్ లో రామ్ (లేదా శ్రీరాముడు) ఉన్నాడని కూడా మురిసిపోయాం. అయితే అసలు ఈ పేరుకు పూర్తి అర్థం ఏమిటో? అసలు ఆ పేరునే ఎందుకు మెగాస్టార్ చిరంజీవి తన వారసుడికి పెట్టుకున్నారో ఎవరికైనా ఏనాడైనా డౌట్ కలిగిందా?
అయితే ఎదుటివారికి సందేహాలు రాక ముందే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు 'గేమ్ ఛేంజర్' ప్రీరిలీజ్ వేదికపై రామ్ చరణ్ కి అసలు ఆ పేరు ఎందుకు పెట్టారో రివీల్ చేసారు. తమ తండ్రి గారు ఆయన మనవడికి 'రామ్ చరణ్' అని పేరు పెట్టడానికి ఏం చేసారో కూడా వెల్లడించారు పవన్ కల్యాణ్.
రామ్ చరణ్ పుట్టినప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను. అన్నయ్యకు అబ్బాయి పుట్టాడు అని తెలిసింది. ఇంట్లో నామకరణం చేసినప్పుడు నాన్న(చరణ్ తాత)గారు ఆంజనేయ స్వామి స్ఫూర్తిని తీసుకున్నారు. మా ఇంట్లో ఎవరికైనా పేరు పెడితే 'ఆంజనేయ స్వామి' పేరు మాత్రమే పెట్టాలి.
రామ్ చరణ్ కి ఈ పేరు పెట్టడానికి కారణం.. రాముడి చరణాల(పాదాల) దగ్గర ఉండే హనుమంతుడు.. బలం ఉండి కూడా నిత్యం వినయం విధేయతతో, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే ఆంజనేయ స్వామిలాగా పేరు ఉండాలనేది ఆలోచన. నాన్నగారు అన్నీ ఆలోచించుకుని `రామ్ చరణ్` అని పేరు పెట్టారు... అని పవన్ తెలిపారు.
చిరంజీవి గురించి ప్రస్థావిస్తూ.. ఆయన అన్నయ్య మాత్రమే కాదు... పితృ సమానులు... మా వదిన నాకు మాతృమూర్తి.. నేను చరణ్‌కి ఒక బాబాయ్ ని కాదు.. నాకు చరణ్ ఒక తమ్ముడు.. అని కూడా ఎమోషనల్ బాండింగ్ గురించి పవన్ రివీల్ చేసారు. సంక్రాంతి బరిలో రిలీజ్ కి వస్తున్న గేమ్ ఛేంజర్ కోసం అభిమానులు సర్వత్రా ఆసక్తిగా వేచి చూస్తున్న సంగతి తెలిసిందే. తాజా ప్రీరిలీజ్ వేడుకతో మూవీకి ఏపీలో మరింత హైప్ పెరగనుంది.