దీపావ‌ళి రోజు స‌ల్మాన్ ఇంటి ముందు టెన్ష‌న్ టెన్ష‌న్

స‌ల్మాన్ ఖాన్ నివాసం చుట్టూ భద్రతను పెంచడానికి అధికారులను అలెర్ట్ చేసింది ఈ ఘ‌ట‌న‌.

Update: 2024-10-31 16:35 GMT

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ చుట్టూ ఇటీవల దీపావళి వేడుకలతో సంద‌డిగా ఉంది. కానీ స‌ల్మాన్ స్నేహితుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్ విషాదకరమైన హత్యకు సంబంధించిన సంఘటనల నేపథ్యంలో భద్రతను భారీగా పెంచారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)లో ప్రముఖ వ్యక్తి అయిన సిద్ధిక్ ని బాంద్రాలోని నిర్మల్ నగర్ సమీపంలో తుపాకీతో కాల్పులు జరపగా గాయాల‌తో లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. షాకింగ్ సంఘటన ఆ ప్రాంతంలో భద్రత గురించి ఆందోళన కలిగించింది. స‌ల్మాన్ ఖాన్ నివాసం చుట్టూ భద్రతను పెంచడానికి అధికారులను అలెర్ట్ చేసింది ఈ ఘ‌ట‌న‌.

ఏ స‌మ‌యంలో ఏం జ‌రుగుతోందో తెలియ‌ని గంద‌ర‌గోళంలో స‌ల్మాన్ ఖాన్ ఇంటి వెలుప‌ల భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసారు ముంబై పోలీస్. ఈ గందరగోళ సమయంలో అత‌డి ర‌క్ష‌ణ‌పై ప‌లు అనుమానాలుండ‌డంతో దీపావ‌ళి ముందు మ‌రింత హైటెన్ష‌న్ క‌నిపించింది. ఏప్రిల్‌లో ఖాన్ నివాసానికి సమీపంలో ఇద్దరు దుండగులు కాల్పులు జరిపినప్పుడు అతడి భద్రతకు సంబంధించి ఆందోళనలు మ‌రింత‌గా బ‌య‌ట‌ప‌డ్డాయి. అందుకే ఇప్పుడు స‌ల్మాన్ ఇంటి చుట్టూ పోలీసులు ఐదంచెల ప‌హారా కాస్తున్న‌ట్టు తెలిసింది. ఏ క్ష‌ణం ఏం జ‌రుగుతుందోన‌నే టెన్ష‌న్ అక్క‌డ ఉన్న‌వారిలో క‌నిపిస్తోంద‌ని హిందీ మీడియా క‌థ‌నాలు ప్ర‌చురిస్తోంది.

సిద్ధిక్ హ‌త్య‌తో స‌ల్మాన్ కి అత‌డి కుటుంబానికి గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ బ‌ల‌మైన హెచ్చ‌రిక పంపాడు. అందుకే ఇప్పుడు పోలీసులు టెన్ష‌న్ లో ఉన్నార‌ని తెలుస్తోంది. ఉన్నత స్థాయి సెల‌బ్రిటీగా ఖాన్ గతంలో బెదిరింపులకు గురి అయ్యాడు. సిద్ధిఖ్ హత్య అనంత‌రం ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో భద్రతను పెంచాల్సిన అవసరం క‌నిపించింది. ప్ర‌భుత్వం కోట్లాది రూపాయ‌లు వెచ్చించి స‌ల్మాన్ ఖాన్ కి భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసింది.

Tags:    

Similar News