సీడెడ్ లో అత్యధిక కలెక్షన్స్ చిత్రాలివే… పుష్ప 2 స్థానం ఎంతంటే?

'దేవర 1' మూవీ 31.85 కోట్ల కలెక్షన్స్ తో మొన్నటి వరకు టాప్ 3లో ఉండేది. 'పుష్ప 2' ఈ వసూళ్లని క్రాస్ చేసింది.

Update: 2024-12-26 09:38 GMT

తెలుగు రాష్ట్రాలలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితాలో 'ఆర్ఆర్ఆర్' మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాత స్థానంలో 'బాహుబలి 2' ఉంది. అయితే షేర్ పరంగా ఈ సినిమా కలెక్షన్స్ ని 'పుష్ప 2' బ్రేక్ చేసింది. 'బాహుబలి 2' మూవీ 204 కోట్ల షేర్ కలెక్షన్స్ తో మొన్నటి వరకు టాప్ 2లో ఉండేది. అయితే దీనిని 'పుష్ప 2' బ్రేక్ చేసింది. 210 కోట్ల షేర్ దిశగా ఈ చిత్రం దూసుకుపోతోంది. అయితే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ని మాత్రం ఇంకా అందుకోలేదు.

సీడెడ్ ప్రాంతం అయిన రాయలసీమ జిల్లాలలో కూడా 'పుష్ప 2' మూవీ భారీ వసూళ్ల దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు సీడెడ్ ప్రాంతంలో ఈ మూవీ 31.95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఈ ప్రాంతంలో 51.04 కోట్ల గ్రాస్ తో మొదటి స్థానంలో 'ఆర్ఆర్ఆర్' ఉంది. దీని తర్వాత రెండో స్థానంలో 34.75 కోట్ల గ్రాస్ తో 'బాహుబలి 2' నిలిచింది. 'దేవర 1' మూవీ 31.85 కోట్ల కలెక్షన్స్ తో మొన్నటి వరకు టాప్ 3లో ఉండేది. 'పుష్ప 2' ఈ వసూళ్లని క్రాస్ చేసింది.

దీంతో 'దేవర' స్థానం తగ్గింది. ఇక ఐదో స్థానంలో ప్రభాస్ 'సలార్ 1' మూవీ ఉంది. ఈ సినిమా లాంగ్ రన్ లో 22.75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక టాప్ 6లో 'బాహుబలి' మూవీ 21.8 కోట్ల గ్రాస్ తో ఉంది. టాప్ 7లో నిలిచిన 'కల్కి 2898ఏడీ' మూవీ 21.80 కోట్లు లాంగ్ రన్ లో వసూళ్లు చేసింది. 'పుష్ప 2' మూవీ కలెక్షన్స్ ఆల్ మోస్ట్ చివరి దశకి వచ్చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మొదటి, రెండు స్థానాలలో ఉన్న 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి 2'ని సీడెడ్ లో బ్రేక్ చేయకపోవచ్చని ట్రేడ్ వర్గాలు అనుకుంటున్నాయి.

ఆర్ఆర్ఆర్ మూవీ – 51.04 కోట్లు

బాహుబలి 2 - 34.75కోట్లు

పుష్ప 2 - 31.95కోట్లు***

దేవర పార్ట్ 1 - 31.85కోట్లు

సలార్ పార్ట్ 1 - 22.75కోట్లు

బాహుబలి - 21.8కోట్లు

కల్కి 2898ఏడీ - 21.80కోట్లు

సైరా - 19.11కోట్లు

వాల్తేరు వీరయ్య - 18.35కోట్లు

అల వైకుంఠపురములో - 18.27కోట్లు

Tags:    

Similar News