చంద్ర‌యాన్ -3 స‌క్సెస్ పై పాక్ న‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

తాజాగా పాకిస్తాన్ న‌టి సెహ‌ర్ షిన్వారి భార‌త్ విజ‌యాన్ని ఆస్వాదిస్తుంది.

Update: 2023-08-24 13:56 GMT

'చంద్రయాన్-3' సక్సెస్ కావడంతో భారత్ పై ప్ర‌పంచం ప్రశంసల జల్లు కురుస్తోంది. శ‌త్రుదేశాలు సైతం భార‌త్ ప‌నిత‌నాన్ని మెచ్చ‌కుండా ఉండ‌లేక‌పోతున్నాయి. స‌రిహ‌ద్దు దేశాల మ‌ధ్య ఎన్నిర‌కాల వైరాలు న్నా! భార‌త్ ప్ర‌తిభ‌ని ఆకాశానికి ఎత్తుతున్నాయి. భార‌త రోద‌సి చ‌రిత్ర‌లో మ‌హాజ్వ‌ల ఘ‌ట్టం కావ‌డంతోనే ఇది సాధ్య‌మైంది. తాజాగా పాకిస్తాన్ న‌టి సెహ‌ర్ షిన్వారి భార‌త్ విజ‌యాన్ని ఆస్వాదిస్తుంది.

త‌న‌దైన శైలిలో భార‌త్ ని ప్ర‌శంసించింది. భార‌త్ ని విమ‌ర్శించే కొంత మంది పాకిస్తానీయుల‌కు సెహ‌ర్ ప్ర‌శంస చెంప పెట్టులా నిలిచింది. ఈ క్ర‌మంలో పాకిస్తాన్ నా సొంత దేశం అన్న సంగ‌తి మ‌ర్చిపోయి సెల్యూట్ చేసింది. అన్ని రంగాల్లో ఇండియా- పాకిస్థాన్ మధ్య గ్యాప్ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇండియా ఉన్న స్థాయికి చేరుకోవాలంటే పాకిస్థాన్ చేరుకోవాలంటే మరో రెండు, మూడు దశాబ్దాల కాలం పడుతుంది. సైన్స్ అండ్‌ టెక్నాలజీ పరంగా భారత్ ఎంతో ఎత్తుకు ఎదిగింది.

మన ఈ దారుణ స్థితికి ఎవరూ కారణం కాదని...మనకు మనమే కారణమని..మ‌న క‌ళ్లు మ‌న‌మే పొడుచుకుం టున్నాం. సిగ్గుతో త‌ల‌దించుకోవాల్సిన స‌మ‌యం మ‌రోసారి వ‌చ్చింద‌ని వ్యాఖ్యానించింది. ఆమె వ్యాఖ్య‌లు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఆమె పై కొంత మంది పాకిస్తానీయులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఆమెకి బాస‌ట‌గా భార‌తీయులు నిలుస్తున్నారు. ఇక షెహ‌ర్ షిన్వారి నెటి జ‌నుల‌కు బాగా ప‌రిచ‌య‌స్తురాలే.

క్రికెట్ అభిమానుల‌కు ఈ అమ్మ‌డు బాగా తెలుసు. గ‌తేడాది భార‌త్-జింబాంబ్వే జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ని ఉద్దేశించి ఓ ఆస‌క్తిక‌ర పోస్ట్ చేసింది. భార‌త్ ని జింబాంబ్వే ఓడిస్తే ఆ దేశ వ్య‌క్తిని పెళ్లి చేసుకుంటానంది.

కానీ ఆ మ్యాచ్ ఇండియా గెలిచింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ క‌నిపించ‌లేదు. అలాగే పాక్ మాజీ అధ్య‌క్షుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ స‌మ‌యంలో ప్ర‌ధాని మోదీని అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేసింది. ఇలా భార‌త్ కి కొన్ని ర‌కాల వ్య‌తిరేక పోస్టులు చేసి వార్త‌ల్లో నిలిచింది.

Tags:    

Similar News