ఆ నలుగురి మల్టీస్టారర్.. జస్ట్ మిస్

సినిమా ప్రపంచంలో ఇటీవల కాలంలో మల్టీస్టారర్ సినిమాలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి అని చెప్పాలి

Update: 2023-09-28 02:30 GMT

సినిమా ప్రపంచంలో ఇటీవల కాలంలో మల్టీస్టారర్ సినిమాలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి అని చెప్పాలి. ఒకప్పుడు అగ్ర హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేయాలి అంటే దాని చుట్టూ ఎన్నో రాజకీయాలు ఉండేవి. నిర్మాతలకు దర్శకులకు అదొక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఏమాత్రం తేడా వచ్చినా కూడా హీరోల ఫ్యాన్స్ నుంచి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి.

కానీ ఈ రోజుల్లో మళ్ళీ అలాంటి బిగ్ మల్టీస్టారర్ సినిమాలు చూసేందుకు ఆడియన్స్ ఎలాంటి భేదాలు చూడడం లేదు. అక్కడక్కడ కొంతమంది ఫ్యాన్స్ నుంచి కొన్ని నెగటివ్ కామెంట్స్ వస్తున్నప్పటికీ మల్టీస్టారర్ సినిమాలకు మాత్రం ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఉంది. కంటెంట్ పర్ఫెక్ట్ గా చూపించాలే కానీ భాషతో సంబంధం లేకుండా అలాంటి సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాయి.

అయితే ఒకప్పుడు దర్శకుడు సల్వా రాఘవన్ కూడా ఒక నలుగురు హీరోలతో హై లెవెల్ లో ఒక బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ సినిమా చేయాలని అనుకున్నాడు. అందులో సూర్య, శింబు, ధనుష్ అలాగే జయం రవి తోపాటు 7/g బృందావన కాలనీ హీరో రవి కృష్ణను కూడా తీసుకోవాలని అనుకున్నారు. ఇక మెయిన్ హీరోయిన్ గా జెనీలియా ను కూడా సంప్రదించగా ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఆ ప్రాజెక్టుకు పుదుపెట్టాయి అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అప్పట్లో ఈ మల్టీస్టారర్ గాసిప్ సౌత్ ఇండస్ట్రీలో కాస్త వైరల్ అయింది. అయితే మళ్లీ ఏమైందో ఏమో కానీ ఆ ప్రాజెక్టు గురించి ఏడాది తర్వాత మళ్లీ ఎవరు కూడా పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. స్క్రిప్ట్ దశలోనే అది క్యాన్సిల్ అయిపోయినట్లుగా ఇటీవల రవికృష్ణ వివరణ ఇచ్చాడు.

ఆ ప్రాజెక్టు వచ్చి ఉంటే చాలా బాగుండేది అని మరి ఎందుకు అది క్యాన్సిల్ అయిందో తనకు కూడా పూర్తిగా తెలియదు అని రవి కృష్ణ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అయితే తమిళ ఇండస్ట్రీలో అప్పట్లో వినిపించిన టాక్ ప్రకారం దర్శకుడు రాఘవన్ యుగానికి ఒక్కడు సినిమాతో మంచి క్రేజ్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత వరుస పరాజయాలతో డౌన్ అయ్యాడు. అందుకే జయం రవి, శింబు వెనకడుగు వేశారు అని అలాగే సూర్య కూడా ఇది కాస్త రిస్క్ తో కూడుకున్న ప్రాజెక్ట్ అని దర్శకుడు కి సున్నితంగా వివరణ ఇవ్వడంతో అందరూ వెనక్కి తగ్గారని సమాచారం.

Tags:    

Similar News