మ‌రో విషాధం..సీనియ‌ర్ న‌టుడు క‌న్నుమూత‌!

ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు టీపీ మాధ‌వ‌న్(88) అనారోగ్యంతో మూసారు. వృద్ధాప్యం, ఇత‌ర‌ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్న ఆయ‌న ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Update: 2024-10-09 11:20 GMT

మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాధం నెల‌కొంది. ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు టీపీ మాధ‌వ‌న్(88) అనారోగ్యంతో మూసారు. వృద్ధాప్యం, ఇత‌ర‌ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్న ఆయ‌న ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మూడు రోజుల క్రితమే ప్ర‌ఖ్యాత న‌టుడు మోహ‌న్ రాజ్ మృతి మ‌రువ‌క ముందే మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇక‌ మాధ‌వ‌న్ మృతి వార్త తెలుసుకున్న కేర‌ళ‌ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్, ఇత‌ర న‌టులు సంతాపం ప్ర‌క‌టించారు. కుటుంబ స‌భ్యుల్ని సెల‌బ్రిటీలు ప‌రామ‌ర్శిస్తున్నారు.

టీపీ మాద‌వ‌న్ 'నాడోడిక్కట్టు', 'పందిప్పాడ', 'ఆర్డినరీ', 'అయల్ కధ ఎళుత్తుకాయన్', 'నమ్మాల్', 'నరసింహం',' ఓరు సీబీఐ డైరీ కురుప్పు', 'మూనమ్ మురా', 'అచ్చువెట్టంటే వీడు',' సందేశం' 'ఆరం తంపురాన్' వంటి కొన్ని చిత్రాలు ఆయ‌న‌కు మంచి పేరును తీసుకొచ్చాయి. అదే విధంగా మ‌ల‌యాళ ఇండస్ట్రీకి చెందిన 'అమ్మ' అసోషియేష‌న్‌కు మాధ‌వ‌న్ మొద‌టి జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ప‌నిచేసారు.

40 ఏళ్ల వ‌య‌సులో విల‌న్ పాత్ర‌ల‌తో కెరీర్ ఆరంభించిన మాధ‌వ‌న్ 2016 వ‌రకూ సినిమాలు చేసారు. దాదాపు 600కు పైగా చిత్రాల‌లో న‌టించారు. విల‌న్ పాత్ర నుంచి క‌మెడియ‌న్‌గా అటుపై క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్ర‌లు పోషించారు. 1975లో 'రాగం' అనే సినిమాతో కెరీర్ ఆరంభించిన మాధ‌వ‌న్ అదే సంవ‌త్స‌రం అర డ‌జ‌న్‌కు పైగా చిత్రాలు చేయ‌డం విశేషం.

చివ‌ర‌గా ఆయ‌న 2016లో 'మాల్గుడి డేస్' సినిమాలో న‌టించారు. ఆ త‌ర్వాత నారోగ్య స‌మ‌స్య‌ల‌తో సినిమాల‌కు దూరంగా ఉన్నారు. ఆయ‌న‌కు ఇద్ద‌రు సంతానం. కుమారుడు రాజా కృష్ణ మీన‌న్ ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు. హిందీలో 'పిపా', 'చెఫ్‌','ఎయిర్ లిఫ్ట్' వంటి భారీ చిత్రాల‌ను డైరెక్ట్ చేశారాయ‌న‌.

Tags:    

Similar News