25 లీటర్ల పాలు కొని అమ్ముతున్నావా? అని అడిగేవాడిని!
తాజాగా జయసుధ ని ఉద్దేశించి సీనియర్ రచయిత కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ప్రముఖ నటి జయసుధ సినీ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో చిత్రాల్లో నటించి వైవిథ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన ఓ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. సహజ నటిగా నీరాజనాలు అందుకుంటున్నారు. ఐదు దశాబ్ధాల సినీ ప్రయాణం ఆమె సొంతం. ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు అందరి హీరోలతో నటించారు. నిర్మాతగా.. రాజకీయ నాయకురాలిగానూ రాణించారు. ఇప్పటికీ ఎంతో యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. స్టార్ హీరోలకు మామ్ పాత్రల్లో మెప్పించడం సహజనటి ప్రత్యేకత.
మామ్ పాత్రలకు ఎంత మంది నటీమణులున్నా? జయసుధ ఆ పాత్ర పోషించారంటే ప్రత్యేకమైన గుర్తింపు గౌరవంగా హీరోలు భావిస్తుంటారు. తాజాగా జయసుధ ని ఉద్దేశించి సీనియర్ రచయిత కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ మధ్య కాలంలో మధు పాత తరం హీరోయిన్ల గురించి రకరకాల విషయాలు పంచుకుంటోన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో జయసుధ వంతు రావడంతో ఓపెన్ అయ్యారు. అవి ఏంటో ఆయన మాటల్లో.. 'జయసుధ కంటూ ఓస్టైల్ ఉంది. సినిమా ఉంటే షూటింగ్ సెట్లో ఉంటారు..సాయంత్రమైతే పార్టీలో ఉంటారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ పార్టీ కల్చర్ కి చాలా మంది అలవాటు పడ్డారు.
హోటల్స్ వాళ్లే ఫోన్ చేసి పార్టీ ఉందని చెబుతుంటారు. అది ఒకరోజు కాదు రోజు కూడా. సెలబ్రిటీలు వెళ్తే వాళ్లకి రిపిటేషన్ ఉంటుందని అలా పిలుస్తారు. వెళ్తే తాగినంత పోస్తారు..తింటే తిన్నంత పెడతారు. వచ్చే టప్పుడు పుల్ బాటిల్ చేతికి ఇచ్చి పంపిస్తారు. జయసుధ అప్పట్లో ఇంటి అవసరాల కోసం 25 లీటర్ల పాలు తీసుకునే వారు. ఆమె బ్రదర్స్ ..పిల్లలు..అక్క చెల్లెళ్లు అంతా ఒకేచోట ఉండేవారు. దీంతో ఆమె లెక్క లేకుండా ఖర్చు చేసేవారు.
ఇన్ని పాలు ఎందుకు? కొని అమ్ముతున్నావా? అని అడిగేవాడి. డబ్బులు దాచుకోరు. తన స్టేజ్ ఉన్న వాళ్లతో ఎక్కువగా పార్టీలకు వెళ్తుంటారు. అలాగనీ డౌన్ అవ్వలేదు. ఆమె మెయింటనెన్స కి కావాల్సినవన్నీ రెడీగా ఏర్పాటు చేసుకుంటారు. జయప్రద గారికి మరో రకమైన స్టైల్. వీళ్లంతా మంచి ఫాంలో ఉన్నసమయంలో వారిని వెనుకుండి వేరే వారు లీడ్ చేస్తుంటారు. వాళ్లు అంతా తెలుసుకునే సరికి చేతులు కాలిపోయి ఉంటాయి. వాళ్లు ఏ విషయాలు పట్టించుకోకపోవడం వల్ల అలాంటి సమస్యలు తలెత్తుంటాయి' అని అన్నారు.