ఎన్టీఆర్ అథ్లెట్... అందుకే యంగ్ టైగర్ పేరు!
ఈ ట్యాగ్ పై సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి.
ఎన్టీఆర్ ను ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీలో చాలా మంది కూడా యంగ్ టైగర్ అంటూ పిలుచుకుంటారు. పలు సినిమా టైటిల్స్ లో కూడా యంగ్ టైగర్ ట్యాగ్ తో ఎన్టీఆర్ పేరును వేయడం జరిగింది. ఈ ట్యాగ్ పై సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి.
యమదొంగ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కు దర్శకుడు రాజమౌళి ఈ ట్యాగ్ ఇచ్చారట. రాజమౌళి ఏం చేసినా కూడా చాలా డెప్త్ ఉంటుంది. ఆయన ఏ ఉద్దేశ్యంతో పెట్టారో గానీ యంగ్ టైగర్ అనే ట్యాగ్ కచ్చితంగా ఎన్టీఆర్ కి సూట్ అయ్యేది అనడంలో సందేహం లేదు అని సెంథిల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ సినిమా షూటింగ్ సమయంలో ఆయన స్పీడ్ ను అందుకోవడం కెమెరాకి ఇతర నటీనటులకు కాస్త ఇబ్బందే. అంత స్పీడ్ గా ఎన్టీఆర్ ఎలా పరిగెత్తుతారు అంటూ ప్రశ్నించగా... తారక్ నేషనల్ లెవెల్ అథ్లెట్ కనుక ఆ స్పీడ్ అని తెలిసిందని సెంథిల్ అన్నాడు.
అంతా కూడా నందమూరి ఫ్యామిలీ వారసుడు అవ్వడం వల్ల, లేదంటే ఏదో అభిమానం కు అలా పిలుచుకుంటాం అని అంతా అనుకున్నారు. కానీ అథ్లెట్ అవ్వడం వల్ల ఆ స్పీడ్ తో యంగ్ టైగర్ ట్యాగ్ ను సొంతం చేసుకున్నాడు అని సెంథిల్ మాటలతో అర్థం అయ్యింది.
ప్రస్తుతం దేవర సినిమాతో పాటు వార్ 2 సినిమా లు చేస్తున్న ఎన్టీఆర్ వచ్చే ఏడాదిలో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు. దేవర 2 కూడా వచ్చే ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.