ట్రైలర్: శబ్దంతో ఆది హారర్ డోస్..
ఇప్పుడు ఆయన లీడ్ రోల్ లో హారర్ థ్రిల్లర్ మూవీ శబ్దం చేస్తున్నారు.
యాక్టర్ ఆది పినిశెట్టి గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్, కోలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన లీడ్ రోల్ లో హారర్ థ్రిల్లర్ మూవీ శబ్దం చేస్తున్నారు. అరివజగన్ వెంకటాచలం దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే వారి కాంబోలో వచ్చిన వైశాలి మంచి హిట్ గా నిలిచింది.
దీంతో ఇప్పుడు శబ్దం మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. సినిమాలో అలనాటి అందాల తార లైలా కీలక పాత్రలో నటిస్తున్నారు. సిమ్రన్, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్ స్లే ఇతర ముఖ్యమైన రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారు. 7జీ ఫిలిమ్స్, అల్ఫా ఫ్రేమ్స్ బ్యానర్లపై 7జీ శివ నిర్మిస్తుండగా.. ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇప్పటికే మూవీని ఫిబ్రవరి 28వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతకుముందు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అనౌన్స్మెంట్ సమయంలో రివీల్ చేసిన పోస్టర్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు చెప్పినట్లు బుధవారం ట్రైలర్ ను తీసుకొచ్చారు.
వెయ్యి గబ్బిలాలు చెవిలో అరుస్తున్నట్లు ఉంది డాక్టర్.. అంటూ ఓ యువతి చెబుతున్న డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. అయితే అది ఒక ఆడియో హేలోజినేషన్ అని డాక్టర్ చెబుతారు. వెంటనే ఆది పినిశెట్టి ఎంట్రీ ఇచ్చారు. గబ్బిలాల శబ్దం వెనుక రహస్యాన్ని కనిపెట్టే ఇన్వెస్టిగేటర్ గా హీరో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
అయితే టైటిల్‌కు తగ్గట్టే ట్రైలర్ మైత్తం చిత్ర విచిత్రమైన శబ్దాల చుట్టూ తిరిగింది. దీంతో అసలు శబ్దాల వెనుక ఉన్న రహస్యమేంటి? ఇన్వెస్టిగేటర్ గా హీరో వాటిని ఛేదించారా? అన్న విషయాల చుట్టూ సినిమా అంతా తిరగనున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ ఎంతో ఉత్కంఠగా అందరినీ ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో అలరిస్తోంది.
ఇక సినిమాలో ఆది పినిశెట్టి తన యాక్టింగ్ తో ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు. ఇన్వెస్టిగేటర్ గా మెప్పించనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మిగతా నటీనటులు తమ రోల్స్ లో ఒదిగిపోయినట్లు ఉన్నారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అట్రాక్టివ్ గా ఉంది. స్టోరీ నేపథ్యానికి తగట్టు ఉండి మెప్పిస్తుంది. విజువల్స్ బాగున్నాయనే చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి. మరి శబ్దం మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.