YRF స్పై యూనివర్స్ షాడో?
అయితే ఈ స్పై యూనివర్శ్ ఆలోచన వెనక ఉన్న క్రియేటివ్ రైటర్ ఎవరో తెలుసా? యష్ రాజ్ అధినేత ఆదిత్య చోప్రా కాదు..
ప్రతిష్ఠాత్మక YRF సంస్థ స్పై యూనివర్స్ పేరుతో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. షారూఖ్ ఖాన్- సల్మాన్ ఖాన్- హృతిక్ రోషన్ లాంటి దిగ్గజ హీరోలతో వరుసగా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్లను తెరకెక్కిస్తోంది. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్లుగా మారుతున్నాయి. మాస్ ని పదే పదే థియేటర్లకు రప్పించే ఫార్ములాటిక్ సినిమాలతో యూనివర్శ్ ని క్రియేట్ చేసి స్టార్ హీరోలందరినీ ఒకే సినిమాలో చూపిస్తూ, యూనివర్శ్ పేరుతో భారీగా వసూళ్లను కొల్లగొట్టే మంత్రాంగాన్ని యష్ రాజ్ బ్యానర్ తెలివిగా నడిపించేస్తోంది.
అయితే ఈ స్పై యూనివర్శ్ ఆలోచన వెనక ఉన్న క్రియేటివ్ రైటర్ ఎవరో తెలుసా? యష్ రాజ్ అధినేత ఆదిత్య చోప్రా కాదు.. ఈ ప్రతిభావంతుడు రెండు సార్లు జాతీయ అవార్డ్ అందుకున్న స్టార్ రైటర్.. టైగర్ 3, వార్ & పఠాన్ చిత్రాల రచయిత.. అతడే YRF యూనివర్స్ వెనుక ఉన్న కీలక వ్యక్తి. అతడి పేరు శ్రీరామ్ రాఘవన్. ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టిటిఐ)లో ఫిలింకోర్స్ పూర్తి చేసి పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు పని చేసారు. రచయితగా, దర్శకుడిగా బాలీవుడ్ లో కొనసాగుతున్నాడు.
శ్రీరామ్ రాఘవన్ (జననం 22 జూన్ 1963) భారతీయ చలనచిత్ర దర్శకుడు- స్క్రీన్ రైటర్. హిందీ సినిమాలకు పనిచేస్తున్నాడు. అతడు ప్రధానంగా నియో-నోయిర్ యాక్షన్ థ్రిల్లర్‌ల రచయితగా పేరు తెచ్చుకున్నాడు. రాఘవన్ ఏక్ హసీన తి (2004)తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అతడు విమర్శకుల ప్రశంసలు పొందిన జానీ గద్దర్ (2007)కి దర్శకత్వం వహించాడు. ఇది 1962లో అలైన్ రేనాడ్-ఫోర్టన్ రచించిన లెస్ మిస్టిఫైస్ అనే ఫ్రెంచ్ నవలకు అనుసరణ. సైఫ్ అలీ ఖాన్ నటించిన యాక్షన్ స్పై చిత్రం ఏజెంట్ వినోద్ (2012) ఫెయిలైంది. రాఘవన్ ఫాలో అప్ `బద్లాపూర్ (2015)`, డెత్స్ డార్క్ అబిస్ ఆధారంగా మాస్సిమో కార్లోట్టో రూపొందించిన చిత్రం సానుకూల సమీక్షలను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఒక మోస్తరు వాణిజ్య విజయాన్ని సాధించింది. అంధాధున్ (2018)తో రాఘవన్ ప్రాధాన్యత పెరిగింది. ఇది ఒక అంధ పియానో ప్లేయర్ స్టోరీతో తెరకెక్కింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వాణిజ్యపరంగా విజయవంతమైంది. అతడు రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు .. రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకోవడమే గాక అనేక ప్రశంసలను అందుకున్నాడు.
ప్రస్తుతం యష్ రాజ్ బ్యానర్ లో కీలక రచయితగా మారాడు. టైగర్ 3లో షారుఖ్ ఖాన్ - హృతిక్ రోషన్ అతిధి పాత్రలు అభిమానులను ఆకట్టుకున్నాయి. నిజానికి ఈ గూఢచారి విశ్వం క్రాస్‌ఓవర్ ఆలోచన వెనుక ఉన్న వ్యక్తి శ్రీరామ్ రాఘవన్. టైగర్ 3 స్క్రీన్‌ప్లే లో రాఘవన్ పనితనం కనిపించిందని ప్రశంసలు ఉన్నాయి. పైసా వసూల్ ఎంటర్‌టైనర్ కథలు రాయడంలో రాఘవన్ పనితనం కనిపిస్తోందని ప్రశంసలు దక్కుతున్నాయి. నిజానికి గూఢచారి విశ్వం ఆదిత్య చోప్రా ఆలోచన అయినప్పటికీ దీనికి అనుబంధంగా ఉన్న సినిమాల కథలను అల్లిన రచయిత మాత్రం శ్రీధర్ రాఘవన్.
టైగర్ 3 రచయిత శ్రీరామ్ రాఘవన్ YRF గూఢచారి విశ్వం సృష్టిలో ప్రధాన పాత్ర పోషించారని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. టైగర్ 3 YRF స్పై యూనివర్స్ సాంకేతికంగా 2011లో టైగర్ జిందా హైతో ప్రారంభమైంది. కానీ ఈ ఏడాది పఠాన్ విడుదల సందర్భంగా లోగోతో అధికారికంగా యూనివర్శ్ ని ప్రకటించారు. టైగర్ 3లో షారుఖ్ ఖాన్ - హృతిక్ రోషన్ అతిధి పాత్రలు పోషించారు. ఈ క్రాస్‌ఓవర్‌ను రూపొందించిన రచయిత శ్రీధర్ రాఘవన్. రాఘవన్ పఠాన్ కోసం `వార్` నుండి పాత్రలను అరువు తెచ్చుకున్నాడు. ఈ మూడింటిని మరింత కనెక్ట్ చేయడానికి చిత్రంలో క్రాస్ ఓవర్ క్యామియోలను చొప్పించాడు. టైగర్, పఠాన్, కబీర్ ప్రపంచాలను ఒకచోట చేర్చిన కథలను అభివృద్ధి చేయడం ద్వారా రాఘవన్ స్పై విశ్వం సృష్టికర్తలలో ఒకరిగా పాపులరయ్యాడు.
రచయితగా శ్రీరామ్ రాఘవన్ ..
గూఢచారి విశ్వంలోని ఉత్తమ చిత్రాలను క్యూరేట్ చేయడానికి రచయితకు సలహాదారుగా ఆదిత్య చోప్రా రాఘవన్‌ను నియమించారు. అతడు 2004లో అమితాబ్ బచ్చన్ `దీవార్`తో స్క్రీన్ రైటర్‌గా కెరీర్ ప్రారంభించాడు. అపహరన్, బ్లఫ్‌మాస్టర్, చాందినీ చౌక్ టు చైనా వంటి చిత్రాల కథలను రాశాడు. అతడు 2000 చివరలో మూడు సంవత్సరాలలో విస్తరించిన 91 ఎపిసోడ్‌లకు పాపులర్ పరిశోధనాత్మక టీవీ షో CIDలో సృజనాత్మక నిర్మాతగా కూడా పనిచేశాడు. అటుపై దర్శకుడిగాను పని చేసాడు.
శ్రీరామ్ రాఘవన్ రైటర్ గా పని చేసిన `టైగర్ 3` దీపావళి కానుకగా నవంబర్ 12 న విడుదలైంది. ఇది పైసా వసూల్ చిత్రం అన్న టాక్ వినిపిస్తోంది. ఇందులో కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీ, రేవతి కూడా కీలక పాత్రల్లో నటించారు.