వింతైన అరుపులు నాలో ఆందోళన పెంచాయి!
ఇటీవలే బాలీవుడ్ నటి దీపికా పదుకొణే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
ఇటీవలే బాలీవుడ్ నటి దీపికా పదుకొణే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తండ్రిగా రణవీర్ సింగ్ ప్రమోట్ అయ్యాడు. ప్రస్తుతం ఆ కుటుంబం సంతోషంలో మునిగి తేలుతోంది. బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమలో దీపిక పాపాయి గురించే చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్యన్ ఖాన్ పుట్టుక అంశం తెరపైకి వచ్చింది. షారుక్ ఖాన్-గౌరీ ఖాన్ లో ముద్దుల కొడుకు అర్యన్ ఖాన్ అన్న సంగతి తెలిసిందే. కుమారుడిని ఎంతో గారాబంగా పెంచారు.
తాజాగా ఓ టాక్ షోల్ ఆర్యన్ ఖాన్ పుట్టుక గురించి షారుక్ ఖాన్...ప్రసవ సమయంలో గౌరీఖాన్ ఎంతగా ఇబ్బంది పడ్డారా? ఆ నాటి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే... `ఒక స్త్రీ ప్రసవ వేదనకు గురైనప్పుడు ఎలా స్పందిస్తుందో నాకు తెలియదు. మీరు ఆమెతో ఊపిరి పీల్చుకోవాలని చెబుతున్నారు. అది నేను బాగా విన్నాను. కానీ ఆమె సరిగ్గా ఊపిరి పీల్చుకోవడం లేదు.
ఆమె చాలా వింతగా అరుస్తోంది. ఆ అరుపులు నాలో ఆందోళన మరింత పెంచాయి. అంతవరకూ అలాంటి సందర్భం ఎదుర్కోలేదు. దీంతో కొంచెం భయపడ్డాను` అన్నారు. డెలివిరీ సమయంలో స్పాట్ లో ఉన్నా రా? అంటే` షారుక్ తల ఊపాడు. అవును. నేను అక్కడే ఉన్నాను` అని అన్నారు. ప్రస్తుతం షారుక్ ఖాన్ కొత్త ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. పఠాన్, జవాన్, డంకీలతో వరుస విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే.
దీంతో షారుక్ మళ్లీ కొన్ని నెలలుగా విరామంలో ఉన్నాడు. మరి ఈ ఏడాది కొత్త ప్రాజెక్ట్ గురించి రివీల్ చేస్తారా? వచ్చే ఏడాది వరకూ వెయిట్ చేయిస్తాడా? అన్నది చూడాలి. హిట్ వచ్చినా..ప్లాప్ వచ్చిన షారుక్ కి గ్యాప్ తీసుకోవడం అలవాటు. హిట్ కొడితే అది బాక్సాఫీస్ చరిత్రలో నిలిచిపోవాలి అన్నట్లే ప్లాన్ చేస్తారు.