ఆఫీస్ కోసం 25లక్షల అద్దె చెల్లిస్తున్న సూపర్‌స్టార్
ఒక ఆన్ లైన్ పోర్టల్ వివరాల ప్రకారం.. షారూఖ్ రెండు డూప్లెక్సుల కోసం 3 కోట్ల అద్దె చెల్లిస్తున్నాడు.
వందల కోట్ల విలువ చేసే విలాసవంతమైన మన్నత్ లో నివశిస్తున్నాడు కింగ్ ఖాన్ షారూఖ్. అయితే తన సువిశాలమైన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు అతడు ఇప్పటికీ ప్రయివేట్ ప్రాపర్టీలకు భారీగా అద్దెలు చెల్లిస్తున్నాడు. ఒక ఆన్ లైన్ పోర్టల్ వివరాల ప్రకారం.. షారూఖ్ రెండు డూప్లెక్సుల కోసం 3 కోట్ల అద్దె చెల్లిస్తున్నాడు.
ముంబైలోని ఉన్నత స్థాయి పాలి హిల్ ప్రాంతంలో రెండు విలాసవంతమైన డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌లను రూ. 2.9 కోట్ల వార్షిక అద్దెకు అద్దెకు తీసుకున్నారు. ఫిబ్రవరి 14న లీజు ఒప్పందాలను రిజిస్టర్ చేసారు. నెలకు రూ. 24.15 లక్షల అద్దెకు ఒప్పందం చేసుకున్నట్టు ఈ పత్రం వెల్లడించింది. ముంబైలోని ఖార్‌లోని పాలి హిల్‌లో ఉన్న `పూజా కాసా` భవనంలో సూపర్‌స్టార్ రెండు డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌లను రూ. 2.9 కోట్ల వార్షిక అద్దెకు లేదా నెలకు రూ. 24.15 లక్షల అద్దెకు తీసుకున్నారు. అద్దె ఒప్పందాలు రిజిస్టర్ అయ్యాయి. 36 నెలలకు లీజ్ తీసుకున్నారు. ఒక అపార్ట్‌మెంట్ జాకీ భగ్నాని, అతడి సోదరి దీప్షికా దేశ్‌ముఖ్ నుండి లీజుకు తీసుకోగా.. మరొకటి జాకీ భగ్నానికి చెందినది అని తెలిసింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. షారుఖ్ చివరిసారిగా రాజ్‌కుమార్ హిరాణీ `డంకీ`లో కనిపించాడు. తదుపరి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో `కింగ్` చిత్రంలో నటిస్తున్నాడు. తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి స్క్రీన్‌ను షేర్ చేసుకుంటున్నాడు. ఈ చిత్రం జనవరి 2025లో షూటింగ్ ప్రారంభించి 2026 మిడిల్ లో విడుదల కానుంది.