ఎన్టీఆర్, హృతిక్ రోష‌న్ మ‌ధ్య‌లో షారుక్ జీ!

బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `వార్-2`ని ఆయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-10-24 05:45 GMT

బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `వార్-2`ని ఆయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దేశ‌..విదేశాల్లో ఇప్ప‌టికే కొద్ది భాగం షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం షూటింగ్ ముంబైలో జ‌రుగుతోంది. ప్ర‌త్యేకంగా సెట్లు వేసి అక్క‌డ హృతిక్, తార‌క్ మ‌ధ్య కీల‌క యాక్ష‌న్ ఛేజింగ్ స‌న్ని వేశాలు చిత్రీక‌రిస్తున్నారు. సినిమాకి ఈ సన్నివేశాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని స‌మాచారం.

ఇంత వ‌ర‌కూ తార‌క్ ఈ రేంజ్ లో ఛేజింగ్ స‌న్నివేశాల్లో న‌టించింది లేదు. తొలిసారి భారీ ఛేజ్ స‌న్నివేశాల్లో న‌టిస్తున్నాడు. హృతిక్-తార‌క్ పాత్ర‌లు తెర‌పై నువ్వా? నేనా? అన్న రేంజ్ లో పోటీ ప‌డి సాగుతాయ‌ని చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా ఇదే సినిమాలో మ‌రో స్టార్ హీరో యాడ్ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. బాద్ షా షారుక్ ఖాన్ సినిమాలో కీలక పాత్ర‌కి ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం.

షారుక్ ఖాన్ పై కూడా కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాలుంటాయ‌ని టాక్ వినిపిస్తుంది. అయితే ఆ పాత్ర హృతిక్ రోల్ కి పాజిటివ్ గా ఉంటుందా? తార‌క్ రోల్ కి పాజిటివ్ గా ఉంటుందా? అన్న‌ది తెలియాల్సి ఉంది. షారుక్ ఖాన్ ఎంట్రీ ఖ‌రారైతే సినిమా స్పాన్ ఇంకా పెరుగుతుంది. ఒకే ప్రేమ్ లో ముగ్గురు స్టార్ హీరోలు క‌నిపిస్తే అభిమానుల‌కు పండ‌గే. పెద్ద ఎత్తున బిజినెస్ జ‌రుగుతుంది. హృతిక్, తార‌క్ ఇమేజ్ తో నార్త్ లో పీక్స్ లో బిజినెస్ జ‌రుగుతుంది.

తార‌క్ ఇమేజ్ తో టాలీవుడ్ స‌హా మాలీవుడ్ ఇత‌ర భాష‌ల్లో తిరుగుండ‌దు. ఆర్ ఆర్ ఆర్, దేవ‌ర లాంటి విజ‌యాల‌తో నార్త్ లోనూ తార‌క్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ రెట్టింపు అయింది. దేవ‌ర వసూళ్ల‌లో నార్త్ మార్కెట్ కూడా కీల‌కంగా మారిన త‌రుణంలో వార్-2 కి మ‌రింత క‌లిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.

Tags:    

Similar News