స్టార్ హీరోని తక్కువ చేసే కుట్ర!
`కబీర్ సింగ్` చిత్రంలో అద్బుతంగా నటించిన షాహిద్ కపూర్ తదుపరి మరో రఫ్ అండ్ ఠఫ్ పాత్రతో మెప్పించేందుకు అభిమానుల ముందకు వస్తున్నాడు
`కబీర్ సింగ్` చిత్రంలో అద్బుతంగా నటించిన షాహిద్ కపూర్ తదుపరి మరో రఫ్ అండ్ ఠఫ్ పాత్రతో మెప్పించేందుకు అభిమానుల ముందకు వస్తున్నాడు. అతడు నటించిన `దేవా` విడుదలకు సిద్ధమైంది. ఇందులో పోలీసు అవతారంలో షాహిద్ ప్రామిస్సింగ్ గా కనిపిస్తున్నాడు. అతడి వేషం, భాష, నటన ప్రతిదీ మాస్‌కి కనెక్టవ్వడం చాలా సులువు అని టీజర్, ట్రైలర్ నిరూపించాయి. ఈ చిత్రం జనవరి 31న విడుదల కానుంది.
`దేవా` చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్న షాహిద్ కపూర్ ఓ పాడ్ కాస్ట్ లో తనను తగ్గించే ప్రయత్నం గురించి బహిరంగంగా వ్యాఖ్యానించాడు. తాను పడి లేచే కెరటాన్ని అని, తనను ఎవరూ ఆపలేరని అతడు వ్యాఖ్యానించాడు. రెండు దశాబ్ధాల కెరీర్ లో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి అతడు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. `కబీర్ సింగ్` కంటే ముందు తాను పనిచేసిన ఓ సినిమా విడుదల సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నానని అన్నాడు.
తనను తక్కువ చేసేందుకు తన సహనటులే ప్రయత్నించారని అతడు వ్యాఖ్యానించాడు. దీంతో పద్మావత్ సినిమా సమయంలో షాహిద్ ని తగ్గించేందుకు రణవీర్- దీపిక జంట ప్రయత్నించారని అందరూ భావిస్తున్నారు. నిజానికి హిస్టారికల్ వారియర్ డ్రామా `పద్మావత్`లో షాహిద్ పోషించిన రాజ్ పుత్ రాజకుమారుడి పాత్ర అంతంత మాత్రమేనని, రణ్ వీర్ అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్రలో అద్భుతంగా నటించాడని ఒక ప్రచారం జరిగింది. దానిని దీపిక పీఆర్ తెరపైకి తేవడానికి కారణం షాహిద్ ని తగ్గించడం వారి ఉద్ధేశం. ఇప్పుడు ఈ జంట పేరు పెట్టకుండానే.. పద్మావత్ సినిమా గురించి ప్రస్థావించకుండానే, వారు తనను తగ్గించే ప్రయత్నం చేసారని షాహిద్ చెప్పాడు.
అయితే తనను ఎవరూ ఆపలేరని షాహిద్ అన్నాడు. తన సానుకూల దృక్పథం కారణంగానే జీవితంలో ఎలాంటి సవాళ్లను అయినా ఎదుర్కోగలనని అన్నాడు. నిజమే... భారతదేశంపై దండెత్తిన మహమ్మద్ ఖిల్జీ ముందు ధీరుడిలా నిలబడే రాజ్ పుత్ రాజుగా షాహిద్ నటన అసమానం. దానిని తక్కువ చేసి చూడలేం. కానీ తక్కువ చేసేందుకు పీఆర్ స్టంట్ కీ రోల్ ప్లే చేసిందని షాహిద్ తాజా వ్యాఖ్యల్ని బట్టి అర్థమవుతోంది. ఒకరిని తగ్గించే ఎత్తుగడలు అన్నిసార్లు వర్కవుట్ కావు. పద్మావత్ తర్వాత సోలోగాను అతడు బ్లాక్ బస్టర్ కొట్టాడు. కబీర్‌సింగ్ చిత్రంతో అతడు కెరీర్ బెస్ట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అన్నిటి నుంచీ ఇప్పుడు కంబ్యాక్ అయ్యాడు.