గ్యాంగ్ స్టార్ హుస్సేన్ హుస్తారాగా ఆ స్టార్ హీరో!

దావూద్ ఇబ్ర‌హీం, ఛోటా రాజ‌న్, ఛోటా ష‌కీల్ లాంటి గ్యాంగ్ స్ట‌ర్ల పేర్ల త‌ర్వాత లారెన్స్ పేరు ముంబైలో సంచ‌ల‌నంగా మారింది.

Update: 2024-10-22 19:30 GMT

ప్ర‌స్తుతం ముంబై గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ హెచ్చ‌రిక‌తో ఒణికిపోతుంది. స‌ల్మాన్ ఖాన్ పై తుపాకీ గురి పెట్టిన నేప‌థ్యంలో ఒక్క‌సారిగా ముంబై అలెర్ట్ అయింది. కొంత కాలంగా ఎలాంటి గ్యాంగ్ స్ట‌ర్ లేకుండా ప్ర‌శాంతంగా ఉన్న ముంబై ఇప్పుడు బిష్ణోయ్ హెచ్చ‌రిక‌తో ఒణికిపోతుంది. దావూద్ ఇబ్ర‌హీం, ఛోటా రాజ‌న్, ఛోటా ష‌కీల్ లాంటి గ్యాంగ్ స్ట‌ర్ల పేర్ల త‌ర్వాత లారెన్స్ పేరు ముంబైలో సంచ‌ల‌నంగా మారింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా పేరు మోసిన మ‌రో గ్యాంగ్ స్ట‌ర్ చ‌రిత్ర‌ను తెరక్కించ‌డానికి బాలీవుడ్ రెడీ అవుతోంది.ఒక ప్పుడు ముంబైలో పేరుమోసిన గ్యాంగ్ స్ట‌ర్ గా ఉన్న హుస్సేన్ హుస్తారా? క‌థ‌ని విశాల్ భ‌ర‌ద్వాజ్ తెర‌పైకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇందులో హుస్సేన్ పాత్ర‌కు షాహిద్ క‌పూర్ ని ఎంపిక చేసారు. ఇప్ప‌టికే ఆ పాత్ర‌కు సంబంధించిన ట్రైనింగ్ షాహిద్ క‌పూర్ తీసుకుం టున్నాడుట‌.

గ్యాంగ్ స్ట‌ర్ గా రూపు రేఖ‌ల్ని మార్చుకోవ‌డానికి అన్ని ర‌కాల ట్రైనింగ్ లు ఇప్పిస్తున్నారుట‌. ముంబై గ్యాంగ్ స్ట‌ర్ల పై ఉన్న పుస్త‌కాలు సైతం చ‌దువుతున్న‌ట్లు స‌మాచారం. ముఖ్యంగా మేకోవ‌ర్ విష‌యంలో విశాల్ ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా ప‌క్కా ప్రోపెష‌న‌ల్స్ ఆధ‌ర్వంలోనే ట్రైనింగ్ ఇప్పిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు స్క్రిప్ట్ ప‌నులు కూడా వేగంగా జ‌రుగుతున్నాయ‌ట‌. ఆ ప‌నులు దాదాపు ముగింపు ద‌శ‌కు వ‌చ్చాయ‌ని స‌మాచారం.

ఈ క‌థ‌లో భారీ యాక్ష‌న్ ఉంటుంద‌ని..అలాగే ఎమోష‌న్ కూడా అంతే బ‌లంగా హైలైట్ చేస్తున్నారుట‌. డిసెంబ‌ర్ క‌ల్లా షూటింగ్ మొద‌లు పెట్టాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారుట‌. ప్ర‌స్తుతం షాహిద్ క‌పూర్ `దేవా` చిత్రంలో న‌టి స్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే విశాల్ ప్రాజెక్ట్ పై మరింత దృష్టి పెట్ట‌నున్నారు.

Tags:    

Similar News