అద్దె ఇంటి తిప్పలు..ఫోటోలతో ఆడిషన్లు.. హీరో ఆరంభ కష్టాలు
దీంతో ఒక సాధారణ కుర్రాడిగానే తాను పెరిగానని చెబుతున్న అతడు మరెవరో కాదు.. బాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో షాహిద్ కపూర్.
ఒక్కో సినిమాకి 30 కోట్ల పారితోషికం అందుకునే హీరో తన కెరీర్ ఆరంభ రోజుల్లో కష్టాల గురించి ఓపెనయ్యాడు. అతడు అద్దె ఇంట్లో జీవనం సాగించాడు. మధ్య తరగతి కుర్రాడి సమస్యలు అతడికి ఉన్నాయి. తల్లిదండ్రుల ఆదాయం అంతంత మాత్రమే. తండ్రి పరిశ్రమలో సహాయ నటుడు.. తల్లి కథక్ డ్యాన్సర్. కోట్లకు కోట్లు ఆదాయాలేవీ లేవు. దీంతో ఒక సాధారణ కుర్రాడిగానే తాను పెరిగానని చెబుతున్న అతడు మరెవరో కాదు.. బాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో షాహిద్ కపూర్.
అతడు నటించిన 'దేవా' విడుదల ప్రమోషన్స్ లో ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు షాహిద్. అతడు తన కెరీర్ ఆరంభ కష్టాల గురించి మాట్లాడారు. ప్రఖ్యాత నటుడు పంకజ్ కపూర్ కొడుకు అయినా కానీ.. షాహిద్ పరిశ్రమలో తన తొలినాళ్లలో చాలా సవాళ్లను ఎదుర్కొన్నాడు. బాలీవుడ్‌లో విజయం సాధించడానికి ముందు 250 ఆడిషన్‌లు ఇచ్చానని, అద్దె ఇళ్లలో నివసించాల్సి వచ్చిందని తెలిపాడు. నేను ప్రత్యేక హోదా నుండి రాలేదు.. అమ్మా నాన్నల సాధారణ కెరీర్ దృష్ట్యా జీవనం అంతంత మాత్రమేనని షాహిద్ వెల్లడించారు. కష్టంతో ఎదగడం కాకుండా కొందరు సులువుగా బండి ఎలా నడిపిస్తారో కూడా షాహిద్ చెప్పాడు.
కబీర్ సింగ్ తో విజయం అందుకోవడానికి ముందు తన పడిపోయిన గ్రాఫ్, కష్ట కాలం గురించి షాహిద్ గుర్తుచేసుకున్నాడు. ''నేను ప్రత్యేకత కోసం పాకులాడలేదు కానీ ఒక కళాకారుడిగా, వ్యక్తిగా నన్ను తక్కువ చేసినట్లు పరిశ్రమలో భావించారు. కానీ నేను దానిని ఎప్పుడూ అంగీకరించలేదు''అని అన్నాడు. నా ప్రవృత్తి నన్ను ముందుకు నడిపించింది. 21 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ప్రాణాలతో ఉన్నానంటే, ఏ క్లిష్ట పరిస్థితిని అయినా అధిగమించడం నేర్చుకున్నాను కాబట్టి అని ఆయన అన్నారు.
షాహిద్ నటించిన 'దేవా' చిత్రం జనవరి 31న థియేటర్లలో విడుదల కానుంది. కెరీర్ లో కబీర్ సింగ్ తర్వాత మళ్లీ అంత పెద్ద హిట్టు కోసం షాహిద్ వేచి చూస్తున్నాడు. అది దేవాతో సాధ్యమవుతుందేమో చూడాలి. దేవా టీజర్, ట్రైలర్ ప్రతిదీ ఆకట్టుకున్నాయి.