18 ఏళ్ల తర్వాత ఒకే స్టేజ్‌పై మాజీ ప్రేమికులు.. వీడియో వైరల్‌

18 ఏళ్ల క్రితం వీరిద్దరు కలిసి 'జబ్‌ వి మెట్‌'లో కనిపించారు. ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు కలిసి నటించలేదు, కనీసం ఒకే స్టేజ్‌పై కనిపించలేదు.;

Update: 2025-03-10 06:01 GMT

కారణం ఏదైనా ప్రేమ లేదా పెళ్లి బ్రేకప్‌ కావడం అనేది ఇద్దరికీ గుండె కోత మిగులుస్తుంది. బ్రేకప్‌ తర్వాత మాజీ భార్యా భర్తలు లేదా ప్రేమికులు కలిసినప్పుడు ఒకరకమైన భావోద్వేగం అక్కడ క్రియేట్‌ అవుతుంది. తాజాగా IIFA అవార్డుల వేడుకలో ఆ భావోద్వేగ సంఘటన ఎదురైంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో షాహిద్ కపూర్‌, హీరోయిన్‌ కరీనా కపూర్ ఖాన్‌ ఒకే స్టేజ్‌పై కనిపించారు. వీరిద్దరిది అప్పట్లో హిట్‌ కాంబోగా పేరు ఉండేది. దాంతో వీరి సినిమాలు వస్తున్నాయంటే అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూసేవారు. 18 ఏళ్ల క్రితం వీరిద్దరు కలిసి 'జబ్‌ వి మెట్‌'లో కనిపించారు. ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు కలిసి నటించలేదు, కనీసం ఒకే స్టేజ్‌పై కనిపించలేదు.

షాహిద్ కపూర్‌, కరీనా కపూర్ కాంబోలో చుప్‌ చుప్‌ కే, ఫిదా, 36 చైనా టౌన్‌, జబ్‌ వి మెట్‌ సినిమాలు వచ్చాయి. వీరిద్దరిది హిట్‌ పెయిర్‌గా ప్రచారం జరగడంతో పాటు ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు ప్రముఖంగా వినిపించాయి. కలిసి పార్టీలకు హాజరు కావడంతో పాటు సినిమాల కార్యక్రమాలకు హాజరు అయ్యేవారు. దాంతో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతుందని బాహాటంగానే వార్తలు వచ్చేవి. ఇద్దరి మధ్య ప్రేమ నిజం అని చెప్పకనే చెప్పకుండా షాహిద్ కపూర్‌, కరీనా కపూర్‌ మీడియా ముందే ప్రవర్తించే వారు. షాహిద్‌, కరీనా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే ప్రచారం జరిగింది. కానీ 2007లో కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి ఒకే స్టేజ్‌పై కనిపించలేదు.

సుదీర్ఘ విరామం తర్వాత ఇద్దరు ఒకే స్టేజ్‌పై కనిపించారు. మొదట ఒకరిని ఒకరు చూసుకోకుండా పక్క చూపులు చూస్తున్నట్లుగా కాస్త నర్వస్‌గా అనిపించారు. షాహిద్ కపూర్ స్టేజ్‌పై కరీనా కపూర్‌ పక్కన నిలవడంకు చాలా ఇబ్బంది పడ్డట్లుగా ఆ వీడియోలో చూడవచ్చు. కరీనా చొరవ తీసుకుని షాహిద్ భుజం పై తట్టి ఏదో మాట్లాడటంతో ఆ తర్వాత అతను మాట్లాడాడు. కరీనా భుజం తట్టిన సమయంలో షాహిద్ చిన్న పిల్లాడి మాదిరిగా మారి పోయినట్టు అనిపించింది. అతడి ఫేస్‌ లో ఒక్కసారిగా తెలియని వెలుగు వచ్చింది. అంతే కాకుండా అతడు ఇదే కోరుకున్నాను అన్నట్టుగా ఆ క్షణంలో కనిపించాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

IIFA అవార్డుల వేడుకలో వీరిద్దరు కలిసి పాల్గొనడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా వీరిద్దరు స్టేజ్‌పై ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు మొదట ఇబ్బంది పడ్డారు, ఆ తర్వాత మాట్లాడుకున్న వీడియోను ఒక వ్యక్తి ఎక్స్ లో షేర్ చేశాడు. కరీనా ఎప్పుడు పలకరిస్తుంది అని షాహిద్ ఎదురు చూస్తున్నట్లు ఉన్నాడు. ఆమె మాట్లాడిన వెంటనే చిన్న పిల్లాడి మాదిరిగా ఎగ్జైట్‌ అయ్యాడని అతడు తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. మొత్తానికి షాహిద్‌ కపూర్‌, కరీనా కపూర్ 18 ఏళ్ల తర్వాత ఒకే స్టేజ్‌పై కనిపించడంతో పాటు ఇన్నాళ్ల తర్వాత మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. పర్సనల్‌ లైఫ్‌ లో ఇద్దరు ఎవరికి వారు చాలా సంతోషంగా ఉన్నారు. కనుక బ్రేకప్‌ బాధ ఇప్పుడు ఏమీ ఉండక పోవచ్చు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News