బాద్‌షాలో చిలిపిదనం కూతురిలోను?
నిజమైన ప్రేమికుడు అంటే ఎలా ఉండాలి? అనేందుకు ఈ సినిమాలో అతడి పాత్ర బెంచ్ మార్క్ గా మారింది. కాజోల్ వెంటపడుతూ అతడు తన ప్రేమను ఆవిష్కరించే ప్రతి సన్నివేశంలో కింగ్ నటన అసమానం.;

బాద్ షా షారూఖ్ ఖాన్ ప్రత్యేకత ఎందులో ఉంది? అంటే.. అతడి అభినయంలో అని సులువుగా చెప్పేయగలరు అభిమానులు. అతడి నవ్వు.. చూసే చూపు.. కొంటెదనం.. ఎక్స్ ప్రెషన్ ఏదైనా ప్రతిదీ యూనిక్ నెస్ తో యువతుల హృదయాలను గెలుచుకున్నాయి. అందుకే అతడు సల్మాన్, అమీర్ లాంటి ట్యాలెంటెడ్ స్టార్ల మధ్య కూడా తనదైన ప్రత్యేకతను నిలుపుకుని ఇండస్ట్రీని కింగ్ లా ఏలాడు. నాలుగు దశాబ్ధాల కెరీర్ లో పీక్స్ ని చూపించాడు. ముఖ్యంగా దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే (డిడిఎల్‌జె) లాంటి ప్రేమకథా చిత్రంలో షారూఖ్ అభినయం నభూతోనభవిష్యతి. నిజమైన ప్రేమికుడు అంటే ఎలా ఉండాలి? అనేందుకు ఈ సినిమాలో అతడి పాత్ర బెంచ్ మార్క్ గా మారింది. కాజోల్ వెంటపడుతూ అతడు తన ప్రేమను ఆవిష్కరించే ప్రతి సన్నివేశంలో కింగ్ నటన అసమానం.
అందుకే ఇప్పుడు సుహానా ఖాన్ బాలీవుడ్ లో అడుగుపెడుతోంది అనగానే అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఈ భామ అలాంటి ప్రత్యేకమైన ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేమకథలతో బరిలో దిగుతుందని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా సుహానా ఆరంభమే యాక్షన్ సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ది ఆర్చీస్ వెబ్ సిరీస్ తనకు ప్రాక్టీస్ సెషన్ మాత్రమే. కానీ పెద్ద తెరపై తన ఆరంగేట్రాన్ని ఘనంగా చాటాల్సి ఉంది. అందుకే సుహానాపై అభిమానుల అంచనాలు ఒత్తిడిని పెంచుతున్నాయి.
చాలా కాలంగా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ `కింగ్` చిత్రం స్క్రిప్టు పనులు సహా కాస్టింగ్ ఎంపికలలో బిజీగా ఉన్నాడు. ఎట్టకేలకు అన్ని పనులు పూర్తయ్యాయి. తండ్రీ కూతుళ్లు షారూఖ్ - సుహానాలను అతడు ప్రత్యేకంగా ఆవిష్కరించేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడు. ఈ జోడీతో కింగ్ షూటింగ్ మేలో ప్రారంభం కానుండగా, ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ ని ముంబైలోని పాపులర్ స్టూడియోలో ప్రారంభిస్తారు. ఆ తర్వాత యుఏఇ, యూరోపియన్ దేశాల్లోని ఎగ్జోటిక్ లొకేషన్లలో కీలక షెడ్యూల్ తెరకెక్కిస్తారు. యాక్షన్ పార్ట్ ని విదేశాల్లో విజువల్ రిచ్ గా, గ్రాండియారిటీతో రూపొందిస్తారని సమాచారం. కొన్ని యాక్షన్ సీన్స్ లో తండ్రీ కూతుళ్లు కలిసి కనిపిస్తారని కూడా టాక్ ఉంది. షారూఖ్ మరోవైపు పఠాన్ 2లో కూడా నటించాల్సి ఉంది.