హ్యాండిస్తుద‌నుకున్నాం..అలాగే ఇచ్చింది!

షారుక్ ఖాన్ -ట్వింకిల్ ఖ‌న్నా జంట‌గా అబ్బాస్ ముస్తాన్ తెర‌క్కించిన `బాద్ షా` అప్ప‌ట్లో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే.

Update: 2024-08-31 11:30 GMT

షారుక్ ఖాన్ -ట్వింకిల్ ఖ‌న్నా జంట‌గా అబ్బాస్ ముస్తాన్ తెర‌క్కించిన `బాద్ షా` అప్ప‌ట్లో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. షారుక్ ఖాన్ కెరీర్ లో ఇదో మైల్ స్టోన్ మూవీ. అత‌డి కి కొత్త ఇమేజ్ ని తీసుకొచ్చిన చిత్ర‌మ‌ది. షారుక్ ని వెండి తెర‌పై తొలిసారి స్టైలిష్ గా ఆవిష్క‌రించిన చిత్ర‌మిది. షారుక్ -ట్వింకిల్ కెమిస్ట్రీ అద్భుతంగా వ‌ర్కౌట్ అయింది. ఆ జంట‌కి ఎన్నో ప్రశంస‌లు ద‌క్కాయి.

ఈ క‌థ‌కి ప‌ర్పెక్ట్ జోడీ అంటూ విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు కురిపించారు. మ్యూజిక‌ల్ గానూ సినిమా మంచి విజ‌యం సాధించింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ అయి 25 ఏళ్లు పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా సినిమా గురించిన ఆ స‌క్తిక‌ర విష‌యాలు చిత్ర నిర్మాత‌లు పంచుకున్నారు. `బాద్ షా` సినిమా కంటే ముందు షారుక్ పెద్ద హీరో. అప్ప‌టికే ఆయ‌న‌కు మంచి క్రేజ్ ఉంది. అది దృష్టిలో ఉంచుకుని ఆయ‌న స‌ర‌స‌న న‌టించ‌డం పెద్ద హీరోయిన్ అవ‌స‌రమ‌ని భావించి చాలా మంది పేర్ల‌ను ప‌రిశీలించా.

మొద‌ట హీరోయిన్ గా ట్వింకిల్ ఖ‌న్నాని అనుకోలేదు. ఆమె ఆలోచ‌న కూడా మాకు రాలేదు. తొలిసారి క‌రీశ్మాక‌పూర్ ని హీరోయిన్ గా సంప్ర‌దించాం. ఆమె ఒప్పుకుంది. కానీ ఆమె న‌టిస్తుందా? లేదా? అని తొలి రోజు సందేహంగానే ఉండేది. చివ‌ర్లో న‌టించ‌న‌ని చెప్పింది. అనుకోని కార‌ణాల వ‌ల్ల ఆమె సినిమా నుంచి త‌ప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో ట్వింకిల్ ఖ‌న్నాని తీసుకున్నాం` అని అన్నారు.

11 కోట్ల బ‌డ్జెట్ లో ఈ చిత్రాన్ని వేనూస్ మూవీస్ నిర్మించింది. బాక్సాఫీస్ వ‌ద్ద 30 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. 1999లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా విజ‌యం త‌ర్వాత షారుక్ సినిమాల జోరు మ‌రింత పెరిగింది. 1999 లో కేవలం ఆ ఒక్క సినిమా మాత్ర‌మే రిలీజ్ అయింది. ఆ త‌ర్వాత 2009 లో వ‌ర‌కూ గ్యాప్ లేకుండా సినిమాలు చేసారు.

Tags:    

Similar News