'పీకే'లా 'డంకీ' ఫేమస్ అవుతుందనుకున్నారా?
అమీర్ ఖాన్-రాజ్ కుమార్ హిరాణీ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పీకే' ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే
అమీర్ ఖాన్-రాజ్ కుమార్ హిరాణీ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పీకే' ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. బాక్సాఫీస్ 770 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రమిది. అమీర్ ఖాన్ కి కొత్త ఇమేజ్ ని తీసుకొచ్చిన సినిమా గా నిలిచింది. అమీర్ నగ్నంగా నటించిన వైనం నటుడిగా అతనికి ఎంతో గొప్ప పేరు తీసుకొ చ్చింది. ఆ రకంగా 'పీకే' టైటిల్ ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్లింది. అసలు పీకే అంటే ఏంటో ఇప్పటివరకూ కూడా క్లారిటీ లేదు.
కానీ సినిమా విజయం సాధించడంతో 'పీకే' మార్కెట్ లో ఓ బ్రాండ్ అయిపోయింది. అయితే తాజాగా రిలీజ్ అయిన 'డంకీ' విషయంలోనూ అదే జరుగుతుందని షారుక్ ఖాన్ భావించినట్లు ఆయన మాటల ద్వారా తెలుస్తోంది. షారుక్ ఖాన్ కథానాయకుడిగా రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కిన 'డంకీ' ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి షారుక్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ఈ ప్రాజెక్ట్ ప్రారంభించే ముందు 'డంకీ' ప్రయాణం గురించి నాకు పెద్దగా తెలియదు. ఈ కాన్సెప్ట్ నాకు చాలా కొత్తగా ఉందని అనిపించింది. రాజు సర్ - నేను చాలా కాలంగా సినిమా చేయాలనుకుంటున్నాము. రాజు సార్ కథకు సంబంధించిన విషయాలు సరిగ్గా చెప్పకపోతే అతనే ముందుకు రారు. ఈ చిత్రానికి 'డంకీ' అనే టైటిల్ పక్కాగా యాప్ట్ అవుతుందని రాజు సార్ అభిప్రాయపడ్డారు.
నాకు టైటిల్ బాగా నచ్చింది. నిజానికి డంకీ అంటే ఏమిటో? ప్రజలు అర్థం చేసుకోలేరు. కానీ ఆ విషయాన్ని మేము పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే 'పీకే' అంటే ఏమిటో కూడా అప్పుడు జనాలకు తెలియదు. రిలీజ్ తర్వాతే పీకే గురించి తెలిసింది'' అని అన్నారు. కానీ 'పీకే'లా 'డంకీ' ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేదు. ఓపెనింగ్స్ పరంగా షారుక్ రేంజ్ ని టచ్ చేయలేదు. సినిమాలో డ్రామా అందరికీ కనెక్ట్ కాలేదు. ఇందులో తాప్సీ పన్ను కథానాయికగా నటించింది. బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్, అనిల్ గ్రోవర్, విక్రమ్ కొచ్చర్ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.