మరణంపై షారుక్ ఖాన్ సంచలన వ్యాఖ్య!
ఎంత ఎత్తుకు ఎదిగినో ఒదిగే ఉండాలి అనే పదానికి అతడు పర్యాయ పదం లాంటి వారు.
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో షారుక్ ఖాన్ ఎదిగిన వైనం గురించి చెప్పాల్సిన పనిలేదు. టీవీ ఆర్టిస్ట్ గా మొదలై బాలీవుడ్ వెండి తెరను ఏలే స్థాయికి ఎదిగారు. ఎదిగే క్రమంలో ఎన్నో అటు పోట్లు చూసారు. ఎన్నో అవమానాలు ఎదుర్కున్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి చిత్ర పరిశ్రమలో ఓ లెజెండ్ గా ఎదిగారు. ఇంత వరకూ తాను చూడని సక్సెస్ లేదు. చూడని ఖరీదైన జీవితం లేదు. ఎంత ఎత్తుకు ఎదిగినో ఒదిగే ఉండాలి అనే పదానికి అతడు పర్యాయ పదం లాంటి వారు.
షారుఖ్ ఖాన్ ఎదుగుదలను తల్లిదండ్రులు చూడలేకపోయారే ఎప్పుడూ బాధ పడుతుంటారు. ఇది అతడి జీవితంలో తీరని లోటు. పెద్దలు కనిపిస్తే వినయంగా కాళ్లకు నమస్కరించడం అన్నది షారుక్ ఖాన్ లో ఉన్న గొప్ప క్వాలిటీ. వాళ్లలోనే తన తల్లిదండ్రులను చూసుకుంటారు. తాజాగా షారుక్ ఖాన్ తన మరణాన్ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. లోకర్న్ ఫిల్మ్ పెస్టివల్ లో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న వేళ అక్కడ మీడియాతో మాట్లాడారు.
అందులో భాగంగా ఓ జర్నలిస్ట్ మీరు జీవితాంతం నటుడిగా కొనసాగుతారా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి షారుక్ ఇలా బధులిచ్చారు. `చనిపోయే వరకూ సినిమాల్లోనే ఉంటాను. ఏదైనా సినిమా సెట్ లో యాక్షన్ చెప్పగానే నేను చనిపోవాలి. వాళ్లు కట్ చెప్పాక కూడా పైకి లేవకూడదు. ఇదే నా కోరిక` అన్నారు. అలాగే స్టార్ డమ్ ని ఎలా ఫీలవుతారు? అంటే స్టార్ డమ్ ని చాలా గౌరవిస్తాను.
దాని వల్లే అభిమానుల, ప్రేమ గౌరవం, డబ్బు అన్నీ దక్కుతున్నాయి. నాకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. కానీ ప్రస్తుతం జనాలు చాలా సున్నితంగా ఉన్నారు. ఏం చెప్పినా డిస్టబ్ అవుతున్నారు. కాబట్టి సెన్సాఫ్ హ్యూమర్ లేకపోవడమే మంచింది` అని అన్నారు.