ఐపిఎల్ ఫైన‌ల్: కింగ్ ఖాన్ ఫ్యామిలీ హ‌గ్గులు ముద్దులు!

అయితే వాళ్లు క‌ప్ గెలుచుకోవ‌డం మాట అటుంచితే, ఇప్పుడు ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన విష‌యం వేరొక‌టి ఉంది

Update: 2024-05-27 03:39 GMT
ఐపిఎల్ ఫైన‌ల్: కింగ్ ఖాన్ ఫ్యామిలీ హ‌గ్గులు ముద్దులు!
  • whatsapp icon

మ్యాచ్ ఓడిపోతే ముఖం ట్యూబ్‌లైట్ లా మాడిపోవ‌డం.. విన్ అయితే 1000 వాట్ బ‌ల్బ్ లా వెలిగిపోవ‌డం .. ఇలాంటి ఎక్స్ ప్రెష‌న్స్ ని అత‌డిలో మాత్ర‌మే చూడ‌గ‌లం అని చెబుతుంటారు స‌న్నివేశాన్ని ద‌గ్గ‌ర‌గా ప‌రిశీలించిన‌వాళ్లు! ఏది ఏమైనా కానీ.. హైద‌రాబాద్ కి చెందిన ఎస్.ఆర్.హెచ్ టీమ్ ఐపీఎల్ టోర్నీ ఫైన‌ల్లో ఘోర ప‌రాభ‌వం ఎదుర్కొంది. ఈసారి టోర్నీ విజేత‌గా కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్) టీమ్ నిలిచింది. ముచ్చ‌ట‌గా మూడోసారి కప్ గెలుచుకున్న ఆనందంలో కేకేఆర్ సెల‌బ్రేష‌న్ మోడ్ లో ఉంది.

అయితే వాళ్లు క‌ప్ గెలుచుకోవ‌డం మాట అటుంచితే, ఇప్పుడు ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన విష‌యం వేరొక‌టి ఉంది. ఈసారి కూడా ఎప్ప‌టిలానే కేకేఆర్ య‌జ‌మాని అయిన కింగ్ ఖాన్ షారూఖ్ త‌న టీమ్ ని వెన్నంటి ఉన్నాడు. ఈ ఆదివారం సాయంత్రం జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ ని ద‌గ్గ‌రుండి మ‌రీ వీక్షించాడు. ఈ మ్యాచ్ ఆద్యంతం బాద్ షా ఎమోష‌న్స్ కెమెరా కంటికి స్ప‌ష్టంగా చిక్కాయి. బంతి బంతికి అత‌డి ముఖంలో ట్యూబ్ లైట్లు పెట్రోమాక్స్ లైట్లు వెలిగాయ‌న్న‌ది గ‌మ‌నించిన వారు చెబుతున్న మాట‌!

అదంతా అటుంచితే.. KKR విజయం తర్వాత షారుఖ్ ఖాన్ - గౌరీఖాన్, అలాగే వారి వార‌సులు ఆర్యన్ -సుహానా- అబ్రామ్‌ల మ‌ధ్య న‌డిచిన మెలోడ్రామాకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఫ్యామిలీ ఫ్యామిలీ కేకేఆర్ విజ‌యాన్ని గొప్ప‌గా ఆస్వాధించింది. ఎంతో ఎగ్జ‌యిట్ అయిపోవ‌డ‌మే కాదు.. ఎమోష‌న‌ల్ అయిపోయారు ఆ కుటుంబ స‌భ్యులంతా. మ్యాచ్ గెలిచిన స‌మ‌యంలో ఎటు చూసినా కౌగిలింత‌లు ముద్దుల‌తో కుటుంబ స‌భ్యులంతా ఎంతో ఎమోష‌న‌ల్ గా క‌నిపించారు.

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఇది సంబరాల స‌మ‌యం. కేకేఆర్ య‌జ‌మాని షారూఖ్ ఖాన్ తన కుటుంబంలో భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, కుమారులు, ఆర్యన్ ఖాన్ మరియు అబ్రామ్ ఖాన్, అలాగే అతడి బృందంతో కలిసి విజయాన్ని సెల‌బ్రేట్ చేసుకుంటున్న ఫోటోలు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి.

ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ క్లిప్‌లో, షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ త‌న తండ్రిని కౌగిలించుకుని ఆనందాన్ని వ్యక్తం చేసింది. మీరు సంతోషంగా ఉన్నారా? నేను చాలా సంతోషంగా ఉన్నాను!! అంటూ ఎగ్జ‌యిట్ అయిపోయింది సుహానా. స్టార్ కిడ్ కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది. తండ్రీ కూతుళ్లు ఒకరినొకరు కౌగిలించుకోవడంతో, షారూఖ్ కుమారులు ఆర్యన్ ఖాన్- అబ్రామ్ ఖాన్ కూడా తమ తండ్రిని కౌగిలించుకోవడానికి ముందుకు వచ్చారు. వాళ్లంతా గ్రూప్‌ హగ్ తో ఫుల్ గా ఎమోష‌న‌ల్ అయ్యారు.

ఈ క్లిప్‌పై ఒక‌ అభిమాని స్పందిస్తూ, ``ఇది చాలా మధురమైన క్షణం!`` అని వ్యాఖ్యానించ‌గా, మరొక వ్యక్తి ఇలా రాశాడు, `ఇది కింగ్ కుటుంబం.. విక్టరీ హగ్స్` అని రాసాడు. ``వారి తండ్రి ఇప్పుడే ఆసుపత్రి నుండి బయటకు వచ్చారు, అయితే కొంత నాణ్యమైన కుటుంబ సమయాన్ని గడపడానికి వారితో వెళ్ళారు. షారూఖ్‌కు ఎంత అందమైన కుటుంబం ఉంది.. ఎంత అద్భుతమైన పిల్లలు.. తండ్రి కోసం ఎల్లప్పుడూ ఉత్సాహపరుస్తూ క‌నిపిస్తారు. దేవుడు ఆశీర్వదిస్తాడు`` అని వేరొక‌రు రాసారు. షారూఖ్ గొప్ప వ్యక్తి.. అతనికి అందమైన పిల్లలు..అద్భుతమైన భార్య ఉన్నారు! అని మరొక అభిమాని అన్నారు.

గౌరీని ముద్దాడిన షారూఖ్‌:

KKR మ్యాచ్ గెలిచిన తర్వాత, షారుఖ్ తన భార్య గౌరీ ఖాన్‌కు ముద్దు ఇవ్వడం కనిపించింది. అతడు త‌న భార్య‌ను ఘాడంగా కౌగిలించుకున్నాడు. ఇప్పుడు షారూఖ్ తన కుటుంబంతో, అలాగే KKRతో కలిసి విజయాన్ని సెల‌బ్రేట్ చేసుకుంటున్న చాలా వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఐపీఎల్ ఫైనల్‌లో విజయం సాధించినందుకు తమ జట్టు ఆటగాళ్లను కలుసుకుని అభినందించారు. ఒక‌ వీడియోలో అన్‌క్యాప్ చేయని పేసర్ హర్షిత్ రాణా షారూఖ్‌ని కౌగిలించుకొని ఉత్సాహంతో పైకి లేపాడు. IPL అధికారిక పేజీలో షేర్ చేసిన ఓ ఫోటోలో షారూఖ్ మ్యాచ్ విన్నింగ్ క్షణంలో గౌతం గంభీర్ నుదిటిపై ముద్దు పెట్టుకున్నాడు.

KKR గెలుపు గురించి

చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో జరిగిన ఫైనల్లో SRHపై ఆల్ రౌండ్ ప్రదర్శనతో KKR IPL 2024 టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2012లో ఇదే మైదానంలో KKR వారి తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. 26 మే 2024న వారు తమ మూడవ ట్రోఫీని గెలుచుకుని స‌త్తా చాటారు. KKR బౌలర్లు ప్రమాదకరమైన SRH బ్యాటింగ్ లైనప్‌ను 113 పరుగులకు పరిమితం చేయడంలో విజ‌యం సాధించారు. కేవలం 10.3 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి టార్గెట్ ని ఛేదించారు.

Tags:    

Similar News