తండ్రి చేయి ఎప్పుడూ కూతురు తలపై ఉంటుంది: శ్రద్ధా
500 కోట్ల క్లబ్ సినిమాలో నటించిన ఆనందంలో ఉంది శ్రద్ధా కపూర్. ఈ భామకు కెరీర్ బెస్ట్ హిట్ దక్కింది.
500 కోట్ల క్లబ్ సినిమాలో నటించిన ఆనందంలో ఉంది శ్రద్ధా కపూర్. ఈ భామకు కెరీర్ బెస్ట్ హిట్ దక్కింది. ఇలాంటి సమయంలో విజయాన్ని మరో లెవల్లో సెలబ్రేట్ చేసుకోవడానికి తన తండ్రి, సీనియర్ నటుడు శక్తి కపూర్ బర్త్ డే వేడుకలను ఆలంబనగా చేసుకుంది. ప్రముఖ నటుడు శక్తి కపూర్ 72వ పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా శ్రద్ధా రెట్టింపు ఉత్సాహంతో కనిపించింది.
బాలీవుడ్లో అద్బుత నటుడిగా పేరుగాంచిన శక్తి కపూర్ 1977లో అరంగేట్రం చేసినప్పటి నుండి పరిశ్రమపై తనదైన ముద్ర వేసారు. తనవైన హాస్య నటప్రదర్శనలు..భీకరమైన ప్రతినాయక పాత్రలతో అతడు పాపులరయ్యాడు. ముఖ్యంగా కల్ట్ క్లాసిక్ `అందాజ్ అప్నా అప్నా`లో క్రైమ్ మాస్టర్ గోగో పాత్రలో అద్భుతంగా నటించి చిరస్థాయిగా హృదయాలలో నిలిచిపోయారు. పరిశ్రమలో అతడి స్థిరమైన ఉనికి అభిమానులను పెంచింది. అతడు ఫ్యాన్స్ కు, సహచరులకు ప్రియమైన వ్యక్తిగా మారాడు. శక్తి కపూర్ పుట్టినరోజు సందర్భంగా.. చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియాల్లో విషెస్ తెలిపారు.
డిజిటల్ మాధ్యమాలలో.. శ్రద్ధా తన తండ్రితో కలిసి ఉన్న హార్ట్ టచింగ్ ఫోటోని షేర్ చేసింది. శక్తి కపూర్ స్టైలిష్ వైట్ అండ్ బ్లాక్ షర్ట్ తో కనిపించగా, శ్రద్ధ పింక్ టాప్‌లో అందంగా కనిపించింది. క్యాప్షన్‌లో శ్రద్ధా తన తండ్రి పట్ల తనకున్న ప్రేమ, అభిమానాన్ని తెలియజేస్తూ ``ఈ రోజు నా అభిమాన బాపు కి పుట్టినరోజు శుభాకాంక్షలు.... ఒక స్త్రీకి తన తండ్రి చేయి ఎప్పుడూ ఆమె తలపై ఉంటుంది కాబట్టి ఏదైనా చేయగలదు.. లవ్ యు బాపు.. అని ఎమోషనల్ గా రాసింది. ఈ సందేశం తండ్రితో శ్రద్ధాకు ఉన్న అనుబంధాన్ని ఎలివేట్ చేస్తోంది. శక్తి కపూర్ ఆమె కెరీర్ , వ్యక్తిగత జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపారని దీనిని బట్టి అర్థమవుతోంది. శ్రద్ధా చిత్ర పరిశ్రమలో కొత్త శిఖరాలకు ఎదిగి తన తండ్రికి మరింతగా పేరు తెస్తుందనడంలో సందేహం లేదు. తదుపరి శ్రద్ధా క్రిష్ 4లో నటించేందుకు ఛాన్సుందని కథనాలొస్తున్నాయి. శ్రద్ధా తెలుగులో `సాహో` లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.