ఇదేం విడ్డూరం అలియాభ‌ట్ తో నాకు పోలిక‌!

టాలీవుడ్ కి తుఫాన్ లా దూసుకొచ్చిన షాలిని పాండే బాలీవుడ్ లో బిజీ అయిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-04-02 07:24 GMT
ఇదేం విడ్డూరం అలియాభ‌ట్ తో నాకు పోలిక‌!

టాలీవుడ్ కి తుఫాన్ లా దూసుకొచ్చిన షాలిని పాండే బాలీవుడ్ లో బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. తెలుగు సినిమాల అనంత‌రం అమ్మ‌డు హిందీ సినిమాల్లో స్థిర‌ప‌డే ప్ర‌య‌త్నం చేసింది. మ‌ధ్య‌లో కోలీవుడ్ సినిమాలు కూడా చేసింది. టాలీవుడ్ లో పోటీని త‌ట్టుకోలేక అమ్మ‌డు ఎక్కువ సమ‌యం వృదా చేయ‌కుండా షిప్ట్ అయిపోయింది. ప్ర‌స్తుతం హిందీ, త‌మిళ సినిమాల్లో న‌టిస్తోంది. అయితే ఈ బ్యూటీని కొంద‌రు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభ‌ట్ తో పోల్చుతున్నారు.

అందంలో..ఆహార్యంలో అలియాభ‌ట్ లా ఉంటుంద‌ని కంపారిజ‌న్ చేసారు. అయితే ఈ పోలిక షాలిని పాండేకు ఎంత మాత్రం న‌చ్చ‌లేదు. తాను అలియాభ‌ట్ లా ఉండ‌టం ఏంటి? త‌న కంటూ ఓ సొంత ఐడెంటిటీ ఉండాలి అన్న‌ట్లు వ్యాఖ్యానించింది. `ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికే ఒక అలియాభ‌ట్ ఉన్నారు. మ‌రో అలియాభ‌ట్ అవ‌స‌రం లేదు. న‌న్ను ఆమెతో పొల్చోదు. అది నాకెంత మాత్రం నచ్చ‌డం లేదు. ఇది అభిమానంతో చేస్తోన్న ప‌ని అయినా? ఎందుక‌నో న‌చ్చ‌లేదు.

అలియాలా మ‌రోక‌రు ఉండాల్సిన అవ‌స‌రం లేదు. ఉండాల‌ని కూడా అనుకోరు. అలియా అద్భుత‌మైన న‌టి. ఎంతో అందంగా ఉంటుంది. ఈ విష‌యాల్లో ఆమెను స్పూర్తిగా తీసుకుంటాను. ఆమె ను చూసి ఎన్నో విష‌యాలు తెలుసుకుంటున్నాను. కానీ ఆమెతో పొల్చితే మాత్రం న‌చ్చ‌దు. నాకంటూ ఓగుర్తింపు తెచ్చుకో వాల‌న్న‌దే నా తాప‌త్ర‌యం` అని న‌వ్వేసింది. దీంతో ఇప్పుడీ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

సాధార‌ణంగా ఫేమ‌స్ అయిన బ్యూటీల‌తో పోల్చితే న‌వ‌త‌రం భామ‌లు ఎంతో సంతోషిస్తారు. దాన్ని గొప్ప కాంప్లిమెంట్ గా తీసుకుంటారు. ఆమె స్థాయిని చేరుకోవాల‌ని చెబుతుంటారు. కానీ కొంద‌రు మాత్ర‌మే షాలినీలా సొంత ఐడెంటిటీని కోరుకుంటారు. క‌ష్ట‌ప‌డితే సాధించ‌లేనిది ఏదీ ఉండ‌దు...కొత్త‌గా తానే సాధించి చూపిస్తాన‌ని స‌వాల్ విసురుతారు. అలాంటి మ‌న‌స్త‌త్వం గ‌ల‌ది షాలినీ పాండే.

Tags:    

Similar News