చీకటి గదిలో ఆ సీన్ భయమేసి లగెత్తా!
ఇటీవలే ఆమె హీరోయిన్ గా నటించిన మహారాజ్ కూడా ఓటీటీలో రిలీజ్ అయింది.
ముంబై బ్యూటీ షాలిని పాండే గురించి పరిచయం అవసరంలేదు. అమ్మడు 'అర్జున్ రెడ్డి'తో తెలుగు నాట ఏ రేంజ్ లో ఫేమస్ అయిందో తెలిసిందే. ఒక్క సినిమాతో యూత్ లో పిచ్చ పాలోయింగ్ సంపాధించింది.ఆ సక్సెస్ కొన్నాళ్ల పాటు బాగానే అవకాశాలు అందుకుంది. కానీ అవేవి అమ్మడిని సక్సెస్ బాటలో నిలపలేదు. వచ్చిన అవకాశాలు వినియోగించుకోవడంలో విఫలమైంది. అర్జున్ రెడ్డి తర్వాత సరైన హిట్ ఒకటీ లేదు.
దీంతో తమిళ్ లోనూ కొన్ని ప్రయత్నాలు చేసింది గానీ అక్కడా కలిసి రాలేదు. చివరిగా అమ్మడు మళ్లీ సొంత భాషకే చేరుకుంది. ప్రస్తుత హిందీలో సీరియస్ గా ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే ఆమె హీరోయిన్ గా నటించిన మహారాజ్ కూడా ఓటీటీలో రిలీజ్ అయింది. జునైద్ ఖాన్ , జైదీప్ అహ్లవ్ ప్రధాన పాత్రలో సిద్ధార్ద్ మల్హోత్రా తెరకెక్కించిన చిత్రమిది. ఓటీటీలో సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇందులో అమ్మడు ఘాటైన రొమాంటిక్ సన్నివేశాల్లోనూ నటించింది. అయితే ఇది వాస్తవ కథ కావడంతో షాలిని పాండే పాత్రపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 1800 కాలంలో జరిగిన కొన్ని యధార్ధ సంఘటనలు ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈసినిమాలో షాలిని పాండే ప్రత్యేకంగా లైంగిక సన్నివేశంలో నటించింది. ఈ సీన్ చేస్తోన్న సమయంలో అమ్మడు భయానికి గురైనట్లు తాజాగా ఓఇంటర్వ్యూలో రివీల్ చేసింది.
ఇందులో కిషోరీ అనే పాత్రలో షాలిని నటించింది. 'శృంగార సన్నివేశం చీకట గదిలో చిత్రీకరిస్తున్నప్పుడు ఒక్కసారిగా బయటకు పరుగు తీసాను. అది నాపై ఎలాంటి ప్రభావం చూపించిందో తెలియదు గానీ చీకటి గదిలో ఉండాలంటే చాలా భయమేసింది. అందుకే అలా హఠాత్తుగా పరిగెత్తి వెలుతురులోకి వచ్చేసాను.
నా పరిస్థితిని దర్శకుడికి వివరించాను. చుట్టూ ప్రశాంతమైన వాతావరం ఉండాలని చెప్పాను. వారు నన్ను అర్దం చేసుకుని ముందుకెళ్లారు' అని అంది.