మేకింగ్ వీడియో అదిరింది శంబాల..!

శంబాల సినిమాలో ఆది జియో సైంటిస్ట్ గా కనిపించనున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఇదివరకు ఎవరు టచ్ చేయని పాయింట్ తో సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా శంబాల రాబోతుంది.;

Update: 2025-04-14 14:41 GMT
మేకింగ్ వీడియో అదిరింది శంబాల..!

ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా శంబాల. ఈ సినిమాను షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ లో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఏ-యాడ్ ఇన్‌ఫినిటిమ్ ఫేమ్ డైరెక్టర్ యుగంధర్ ముని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. డిఫరెంట్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో రాబోతున్న ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేకింగ్ వీడియో ఇంప్రెస్ చేసింది.

కెరీర్ లో డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఫలితాలతో సంబంధం లేకుండా దూసుకెళ్తున్నాడు ఆది సాయి కుమార్. ఆడియన్స్ కు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతో శంబాల సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫిక్షనల్ స్టోరీతో ఆడియన్స్ ని థ్రిల్లింగ్ కి గురి చేస్తుందని అంటున్నారు.

ఆది సాయి కుమార్ సరసన అర్చన అయ్యార్ హీరోయిన్ గా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా.. లేటెస్ట్ గా వచ్చిన మేకింగ్ వీడియో మరింత ఆకట్టుకునేలా ఉంది. టీజర్ లో విజువల్స్ బాగున్నాయి. ముఖ్యంగా శాంపిల్ టీజర్ లోనే భారీతనం దానికి తగినట్టుగా మ్యూజిక్ అన్నీ బాగా కుదిరినట్టు ఉన్నాయి.

శంబాల సినిమాలో ఆది జియో సైంటిస్ట్ గా కనిపించనున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఇదివరకు ఎవరు టచ్ చేయని పాయింట్ తో సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా శంబాల రాబోతుంది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్న యుగంధర్ ముని హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను భారీ సాంకేతికతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీరామ్ మద్దూరి సంగీతాన్ని అందిస్తున్నారు.

శంబాల మేకింగ్ వీడియో సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేసింది. తప్పకుండా ఇది ఆది కెరీర్ లో సంథింగ్ స్పెషల్ మూవీగా నిలిచేలా ఉంది. ఇక త్వరలో టీజర్ ని కూడా రిలీజ్ ప్లాన్ చేసిన చిత్ర యూనిట్ ప్రాజెక్ట్ పై సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారు.

ఎంచుకున్న పాత్రకు తనవరకు బెస్ట్ అవుట్ పుట్ ఇస్తూ కెరీర్ సాగిస్తున్న ఆది సాయి కుమార్ కెరీర్ లో ఒక మంచి సూపర్ హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. ఐతే సినిమాలు వరుసగా చేస్తున్నా కూడా ఆ సక్సెస్ పడట్లేదు. ఐతే శంబాల మేకింగ్ వీడియోతోనే ఒక పాజిటివ్ వైబ్ ఏర్పడింది. మరి సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.

Full View
Tags:    

Similar News