ఇండియన్ 3 - బ్యాలెన్స్ వర్క్ ఇంకా ఎంత ఉంది?
దేశం మెచ్చిన దర్శకుడిగా ఒకప్పుడు బిగ్ హిట్స్ చూసిన శంకర్ రోబి అనంతరం సతమతమవుతున్న విషయం తెలిసిందే.
దేశం మెచ్చిన దర్శకుడిగా ఒకప్పుడు బిగ్ హిట్స్ చూసిన శంకర్ రోబి అనంతరం సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఎలాంటి సినిమా చేసినా క్లిక్కవ్వడం లేదు. పైగా దారుణమైన నష్టాలను కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ‘భారతీయుడు 2’ ‘గేమ్ ఛేంజర్’ వంటి చిత్రాలు భారీ అంచనాలతో విడుదలై కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పుడు శంకర్ నెక్స్ట్ టార్గెట్ ఏమిటి అనేది హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఆయన ఆశలన్నీ కూడా తదుపరి ప్రాజెక్ట్ ‘భారతీయుడు 3’ మీదనే ఉన్నాయి. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం శంకర్‌కు పెద్ద విజయాన్ని తెచ్చిపెడుతుందా అనేది సర్వత్రా చర్చగా మారింది. శంకర్ ఇటీవల మాట్లాడుతూ ‘భారతీయుడు 3’కు ఇంకా ఆరు నెలల షూటింగ్ పనులు మిగిలి ఉన్నాయని తెలిపారు. వీటిలో ముఖ్యంగా కొన్ని సన్నివేశాల చిత్రీకరణతో పాటు భారీ స్థాయిలో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ పని పూర్తి చేయాల్సి ఉందని వెల్లడించారు.
అందువల్ల, ఈ సినిమా 2025లో రావడం కూడా కావడం అనుమానమే అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. సినిమాకు సంబంధించిన విడుదల తేదీ ఇంకా సస్పెన్స్‌లోనే ఉంది. ఇక ‘గేమ్ ఛేంజర్’ విషయానికి వస్తే, శంకర్ ఆన్‌లైన్ రివ్యూలను పెద్దగా పట్టించుకోలేదు కానీ, ఫైనల్ కట్ పట్ల తాను పూర్తిగా సంతృప్తి చెందలేదని అంగీకరించారు. ఈ చిత్రం అసలు 5 గంటల నిడివి వచ్చిందట.
ఈ కత్తిరింపుల కారణంగా చాలా కీలకమైన సన్నివేశాలు థియేటర్‌లో ప్రసారం కాలేదు, ఇది సినిమా ఫలితంపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ‘భారతీయుడు 3’ ద్వారా శంకర్ తన మునుపటి బ్రాండ్ ఇమేజ్ ను తిరిగి పొందుతారనే ఆశతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం కథాబలం, కమల్ హాసన్ నటన, అలాగే శంకర్ సృష్టించే విజువల్ గ్రాండియర్ ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా నిలబెడతాయని అభిమానులు భావిస్తున్నారు.
ఈ సినిమా కమల్ హాసన్ కెరీర్‌లోనూ కీలకమైన సినిమాగా మారుతుందనే విశ్వాసం ఉంది. అయితే, శంకర్ ఎదుర్కొంటున్న సవాళ్లకు ‘భారతీయుడు 3’ సమాధానమవుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు చూస్తే, ఈ చిత్రం విడుదల కోసం ప్రేక్షకులు 2025 సెకండ్ హాఫ్ వరకు వేచి చూడాల్సిన అవకాశాలు ఉన్నాయి. మరి ఇండియన్ 3తో శంకర్ బౌన్స్ బ్యాక్ అవుతారో లేదో చూడాలి.