రోబో కాపీ వివాదం.. ఆస్తుల సీజ్ పై శంకర్ ఆగ్రహం
ఈ సినిమా స్క్రిప్ట్‌కు సంబంధించిన కథా చౌర్యం కేసులో తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆయన ఆస్తులను సీజ్ చేయడం, సినీ వర్గాల్లో సంచలనం రేపుతోంది.
సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో యందిరన్ ( రోబో) సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మూవీని తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ శంకర్, ఇప్పుడు ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్‌కు సంబంధించిన కథా చౌర్యం కేసులో తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆయన ఆస్తులను సీజ్ చేయడం, సినీ వర్గాల్లో సంచలనం రేపుతోంది.
ఈడీ ప్రకటన ప్రకారం, శంకర్‌కి చెందిన చెన్నైలోని మూడు ఆస్తులను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద అటాచ్ చేశారు. ఈ ఆస్తుల విలువ దాదాపు రూ.10.11 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ చర్యలపై శంకర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఇది పూర్తిగా అన్యాయమని, చట్టపరంగా సవాల్ చేస్తానని స్పష్టం చేశారు.
మద్రాస్ కేసు కోర్టు అప్పుడే తోసిపుచ్చిన తర్వాత ఈడీ ఇలా వ్యవహరించడం ఆశ్చర్యకరంగా ఉంది. మద్రాస్ హైకోర్టు ఆరూర్ తమిళ్‌నాడాన్ పిటిషన్‌ను పూర్వం పూర్తిగా కొట్టిపారేసింది. కానీ ఎప్పుడు పాత ఆరోపణల ఆధారంగా ఇప్పుడు నా ఆస్తులను సీజ్ చేయడమేంటి?.. అని శంకర్ తన అసంతృప్తిని బయటపెట్టారు.
ఎవరి ఆధారాలు లేకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం సరైన పద్ధతి కాదు. నా ఆస్తులపై ఈడీ ఉంచిన ఆంక్షలను తక్షణమే ఉపసంహరించుకోవాలి. లేకపోతే కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాడతాను అని శంకట్ మరో వివరణ ఇచ్చారు. ఇకపోతే, శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్‌తో ఇండియన్ 3 తో పాటు మరో హిస్టారికల్ సినిమాల పనుల్లో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ వివాదం ఆయనకు మరింత తలనొప్పిగా మారింది.
ఇటీవల శంకర్ నుంచి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా క్లిక్కవ్వడం లేదు. చివరగా ఆయన పర్ఫెక్ట్ హిట్ చూసింది ఆంటే రోబో సినిమా ద్వారానే. కానీ ఇప్పుడు అదే సినిమా కాపీ వివాదంలో చిక్కుకుంది. రోబో సినిమా అప్పట్లో 250 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని ఇండియన్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.