దర్శకుడు శంకర్‌ ఫ్యామిలీకి బ్యాడ్‌టైం..!

తండ్రి కూతురు సినిమాలు నాలుగు రోజుల గ్యాప్‌లో వచ్చాయి. మొదట వచ్చిన శంకర్ గేమ్‌ ఛేంజర్‌ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది.

Update: 2025-01-18 10:00 GMT

టాలీవుడ్‌లో రాజమౌళి విజువల్‌ వండర్స్ క్రియేట్‌ చేయడానికి ముందే తమిళ్‌లో శంకర్‌ అద్భుతాలను ఆవిష్కరించారు. విజువల్‌ వండర్‌గా ఆయన పాటలు ఉండేవి. ప్రతి పాటను ఒక సినిమా స్థాయిలో రూపొందించడం ఆయనకే చెల్లింది. సమాజానికి మంచి చేయాలనే తప్పన, మంచి చూపించాలనే ఆలోచన ఉండే దర్శకుడు శంకర్‌ అంటారు. ఆయన నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు కొంతలో కొంత అయినా సమాజంలో మార్పుకు నాంధి పలికి ఉంటాయని శంకర్‌ అభిమానులు అంటూ ఉంటారు. ఆ స్థాయిలో సక్సెస్‌లను దక్కించుకున్న శంకర్ గత కొంత కాలంగా సినిమాలు తీస్తున్నారు కానీ హిట్‌ కొట్టలేక పోతున్నారు. వరుసగా డిజాస్టర్స్‌ని చవిచూస్తున్నారు.

ఇండియన్‌ 2 ఫలితాన్ని మర్చిపోకుండానే వచ్చిన గేమ్‌ ఛేంజర్‌ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. రామ్‌ చరణ్ హీరోగా రూపొందిన గేమ్‌ ఛేంజర్‌ సినిమాతో వింటేజ్‌ శంకర్‌ని చూస్తామని అంతా ఆశ పడ్డారు. సంక్రాంతికి వచ్చిన గేమ్‌ ఛేంజర్‌ సినిమా ఆశలను అడియాశలు చేసింది. తీవ్రంగా నిరుత్సాహపరిచింది. సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. కొన్ని సన్నివేశాలు బాగున్నా ఓవరాల్‌గా సినిమా బాగాలేదు అనే టాక్‌ ఎక్కువగా స్ప్రెడ్‌ అయ్యింది. ఒక వైపు శంకర్‌ గేమ్‌ ఛేంజర్‌తో ఫ్లాప్‌ కాగా, మరో వైపు ఆయన కూతురు అదితి శంకర్‌ సైతం మరో ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకుంది.

నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అదితి శంకర్‌ ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు చేస్తూ ఉంది. తాజాగా ఆకాష్ మురళి హీరోగా విష్ణు వర్ధన్‌ దర్శకత్వంలో రూపొందిన 'నేసిప్పాయ' సినిమాలో అదితి శంకర్‌ హీరోయిన్‌గా నటించింది. పొంగల్ రేసులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేసిప్పాయ సినిమాకు నిరాశ మిగిలింది. తమిళ్‌ ప్రేక్షకులు సినిమాను తిరస్కరించారు. బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. సినిమాకు ఒక మోస్తరుగా ఉంది అనే టాక్ వచ్చినా తీవ్రంగా ఉన్న పోటీ నేపథ్యంలో వసూళ్లు చాలా దారుణంగా ఉన్నాయంటూ తమిళ్ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

తండ్రి కూతురు సినిమాలు నాలుగు రోజుల గ్యాప్‌లో వచ్చాయి. మొదట వచ్చిన శంకర్ గేమ్‌ ఛేంజర్‌ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన అదితి శంకర్‌ సినిమా నేసిప్పాయ సైతం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేక డీలా పడిపోయింది. ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరికి చాలా తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎదురు దెబ్బలు తగలడం అనేది అరుదుగా చూస్తూ ఉంటాం. అందుకే శంకర్‌ ఫ్యామిలీకి ప్రస్తుతం బ్యాడ్‌ టైం నడుస్తున్నట్లుగా అనిపిస్తుందని, త్వరలోనే తిరిగి వీరు పుంజుకోవాలని కోరుకుంటున్నాం అంటూ శంకర్‌ అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. మరి శంకర్‌ పూర్తి వైభవం దక్కించుకుంటాడా? అదితి శంకర్‌ హీరోయిన్‌గా సక్సెస్ అయ్యేనా చూడాలి. అదితి శంకర్‌ తెలుగు లో హీరోయిన్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కలిసి భైరవం సినిమాతో రాబోతుంది. ఆ సినిమా ఫలితంపై అదితి చాలా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News