ఇండియన్-3.. అసలేం జరుగుతోంది?

విలక్షణ నటుడు కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఫస్ట్ మూవీ ఇండియన్.. ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

Update: 2025-02-27 03:00 GMT

విలక్షణ నటుడు కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఫస్ట్ మూవీ ఇండియన్.. ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఏఎం రత్నం రూపొందిన సినిమా.. 1996లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత అనేక ఏళ్ల తర్వాత సీక్వెల్ ఇండియన్-2.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

శంకర్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ మూవీ.. పూర్తిగా నిరాశపరిచింది. దీంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ వచ్చాయి. శంకర్ మార్క్ అస్సలు కనిపించలేదని అనేక మంది రివ్యూస్ ఇచ్చారు.

అదే సమయంలో ఇండియన్-3 కోసం అనౌన్స్మెంట్ వచ్చింది. ఇండియన్-2 సినిమా లాస్ట్ లో మూడో పార్ట్ ట్రైలర్ ను రివీల్ చేశారు. ఆ తర్వాత ఇండియన్ 3 నేరుగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల కానుందని జోరుగా ప్రచారం సాగింది. కానీ ఆ తర్వాత అదేం లేదని శంకర్ తెలిపారు. థియేటర్లలో రిలీజ్ చేస్తామని చెప్పారు.

రీసెంట్ గా ఇండియన్ 3 కోసం మాట్లాడారు. ఇంకా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందని శంకర్ చెప్పారు. అవన్నీ పూర్తి కావడానికి మరో ఆరు నెలల సమయం పడుతుందని తెలిపారు. సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలను త్వరగా కంప్లీట్ చేసి కొన్ని నెలల్లో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు.

అయితే, ఇండియన్ 2 నుంచి భారీ నష్టం వాటిల్లిన కారణంగా లైకా ప్రొడక్షన్స్.. ఇండియన్ 3 నుంచి తప్పుకుందని బలమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రెడ్ జెయింట్ మూవీస్ ఇండియన్ 3 ప్రాజెక్ట్‌ ను పూర్తిగా టేకోవర్ చేయాలని యోచిస్తోంది. శంకర్, కమల్ హాసన్‌ తో ఇండియన్ 3 ప్యాచ్‌ వర్క్‌ ను పూర్తి చేయడానికి రీసెంట్ గా చర్చలు జరిగాయట.

తక్కువ టైమ్ లోనే షూటింగ్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. కానీ లైకా సంస్థ సినిమా నుంచి తప్పుకున్నప్పటికీ ఇండియన్ 3 సినిమా కోసం భారీ బడ్జెట్ ఖర్చు చేయడంతో పాటు, షూటింగ్ లో 10% మాత్రమే పెండింగ్ లో ఉండటం వల్ల వారికి సినిమాలో క్రెడిట్ ఇవ్వనున్నారు. మరి ఇండియన్ 3 మూవీ మిగతా పార్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News