భార‌తీయుడు 2 రిజ‌ల్ట్‌..త‌న‌ను స‌మ‌ర్థించుకున్న శంక‌ర్

ఎట్ట‌కేల‌కు త‌మిళ మ్యాగ‌జైన్ విక‌ట‌న్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో భార‌తీయుడు 2 ప‌రాజ‌యంపై శంక‌ర్ తొలిసారి నోరు విప్పారు.

Update: 2024-12-20 03:55 GMT

క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ తెర‌కెక్కించిన భార‌తీయుడు 1996లో విడుద‌లై ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకి రెండు సీక్వెల్స్ ప్లాన్ చేసారు శంక‌ర్. భార‌తీయుడు 2 (ఇండియ‌న్ 2) ఈ ఏడాది విడుద‌లై పెద్ద ఫ్లాపైంది. కానీ ఈ ప‌రాజ‌యంతో ప‌ని లేకుండా 'భార‌తీయుడు 3'ని విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నారు శంక‌ర్. ఎట్ట‌కేల‌కు త‌మిళ మ్యాగ‌జైన్ విక‌ట‌న్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో భార‌తీయుడు 2 ప‌రాజ‌యంపై శంక‌ర్ తొలిసారి నోరు విప్పారు. ఈ ప‌రాజ‌యాన్ని తాను అస్స‌లు ఊహించ‌లేద‌ని అన్నారు.

ఇల్లు శుభ్రంగా ఉంటే దేశం శుభ్రంగా ఉంటుంది! అనేది అద్భుతమైన ఆలోచ‌న‌. నేటి ప‌రిస్థితుల‌కు అవసరమైనది. . ఇది ఆచరణాత్మకంగా ఎలా అమలవుతుంద‌నేది చిక్కు ప్రశ్న.. మంచి ఆలోచ‌న‌తో సినిమా తీశాను..అని కూడా శంక‌ర్ త‌న‌ను తాను స‌మ‌ర్థించుకున్నారు. అంతేకాదు.. ఈ సినిమా చూశాక హైద‌రాబాద్ లో జ‌రిగిన రెండు వేర్వేరు సంఘ‌ట‌న‌ల్లో దాని ప్ర‌భావం ఎలా ప‌డిందో కూడా శంక‌ర్ వివ‌రించారు.

తెలంగాణలోని ఓ కార్పొరేషన్‌కు చెందిన మహిళా ఇంజనీర్ భర్త లంచం వసూలు చేస్తూ కెమెరాకు చిక్కారు.. అది `భార‌తీయుడు 2` ప్ర‌భావం అని శంక‌ర్ అన్నారు. రెండు రోజుల క్రితం ఓ ఆటో డ్రైవర్‌ దొంగతనం చేశాడు. అతడి ఆటోలో ప్ర‌యాణిస్తున్న‌ మహిళ నుండి బంగారు గొలుసు లాక్కున్నాడు. అతడిని కుటుంబ స‌భ్యుడే పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించాడు. నేను ఈ రకమైన వార్తా క‌థ‌నాలు చూసినప్పుడు సంతోషించి వ‌దిలేయ‌లేదు.. నేను ఇంకా నా ప‌నిపై దృష్టి పెడుతున్నాను.. అని అన్నారు. భార‌తీయుడు 2 ఈ ఏడాది జూన్ లో విడుద‌లై ఫ్లాపైంది. ముఖ్యంగా విమ‌ర్శ‌కులు ప్రేక్ష‌కుల ప్ర‌తికూల స‌మీక్ష‌లు వ‌చ్చాయి. రెండో భాగం ప‌రాజ‌యంతో సంబంధం లేకుండా ఇప్పుడు మూడో భాగం (భార‌తీయుడు 3)ని విడుద‌ల చేస్తామ‌ని కూడా శంక‌ర్ తెలిపారు.

Tags:    

Similar News