ఇండస్ట్రీలో శంకర్ కుమార్తె ఒంటరి పోరాటం!
ఇండస్ట్రీలో కావాల్సింది బ్యాకప్ కాదు..ట్యాలెంట్ అని ఆ రకంగా అదితికి శంకర్ చెప్పకనే చెప్పారు.
సినిమా ఇండస్ట్రీలో ఎవరి ట్యాలెంట్ పై వాళ్లు ఎదగాల్సిందే. ఎంత బ్యాకప్ ఉన్నా అది కొంతవరకే పరిమితం. ఆ తర్వాత స్వతంత్రంగా ఎదగాల్సిందే. వారసులు స్టార్లు అయ్యారంటే? ఆ సక్సెస్ ఒక్క రాత్రిలో వచ్చింది కాదు. కొన్నేళ్ల శ్రమ అన్నది కష్టపడి పైకొచ్చిన వారికే తెలుస్తుంది.
దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అగ్ర దర్శకుడయ్యాడంటే? అతని ప్రతిభ మాత్రమే కొలమానం. నటిగా ఎంట్రీ ఇచ్చిన అదితి శంకర్ కూడా తనలో స్వయంగా తనకు తానుగానే ఎదగాలి అన్నది ఆయన లెక్క.
అందుకే ఏ విషయంలోనూ శంకర్ ఇన్వాల్వ్ కావడం లేదన్నది వాస్తవం. ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి శంకర్ భార్య-కుమార్తె అదితి హాజరయ్యారు. కానీ శంకర్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. తెలుగులో అదితి నటించిన తొలి రిలీజ్ అదే.
అంతకు ముందు కనీసం కుమార్తెలకు మహేష్ తో సెల్పీ కూడా తీయించలేదు శంకర్. స్టార్ స్టేటస్ ఎలా ఉంటుందో వాళ్లకి తెలియాలనే శంకర్ ఓ సందర్భంలో అలా చేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని శంకర్ ఓపెన్ గానే చెప్పారు.
ఇండస్ట్రీలో కావాల్సింది బ్యాకప్ కాదు..ట్యాలెంట్ అని ఆ రకంగా అదితికి శంకర్ చెప్పకనే చెప్పారు. ఇప్పటి వరకూ శంకర్ ఏ నిర్మాతకు గానీ..దర్శకుడు గానీ నా కుమార్తెకి అవకాశం ఇవ్వండని అడిగింది లేదు అంటే? అతిశయోక్తి కాదు. అదితి ఐదు సినిమాలు చేసింది. వాటిలో మూడు రిలీజ్ అయ్యాయి. కొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఇదంతా అదితి తనకు తానుగా సాధించుకున్న అవకాశాలు.
ఇందులో ఎక్కడా శంకర్ ఇన్వాల్వ్ మెంట్ లేదు. ఇప్పటికే పరిశ్రమ అంటే ఎలా ఉంటుందో? అదితికి ఓ అవగాహన వచ్చేసింది. శంకర్ లా కష్టపడే తత్వం కనిపిస్తుంది. ఆమె వెనుక తల్లి తప్ప ఇంకెవ్వరు లేరు. దీంతో కెరీర్ లో ఆమె మరింత హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడున్న పోటీని ఎదుర్కోవాలంటే? ఆమె యూనిక్ పెర్పార్మర్ అయి ఉండాలి. సమ్ థింగ్ డిఫరెంట్ అనిపించాలి.
ఆ స్టేజ్ కి చేరుకోవడం అంత వీజీ కాదు. కష్టంతో పాటు లక్ కూడా కలిసి రావాలి. ఇవన్నీ అదితి శంకర్ చేస్తుందా? అన్నది చూడాలి. స్టార్ హీరోయిన్ లీగ్ లో చేరిన తర్వాత శంకర్ నా కుమార్తె అని గర్వంగా చెప్పుకునేలా అతిది చేయాలి.