మాల్దీవ్స్‌లో బికినీలో ఎవ‌రీ ల‌వ్‌లీ?

ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల సామాజిక మాధ్య‌మాల్లో సినిమా ఫోటోల‌ను షేర్ చేసుకుని ఆనందం వ్య‌క్తం చేసింది.

Update: 2024-09-08 21:30 GMT

'ల‌వ్‌లీ' చిత్రంతో తెలుగు వారికి ప‌రిచ‌య‌మైంది క‌న్న‌డ‌ బ్యూటీ శాన్వి శ్రీ‌వ‌త్స‌వ‌. ఆది సాయికుమార్ హీరోగా ద‌ర్శ‌కురాలు బి.జ‌య ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. క్యూట్‌ లుక్స్ తో కుర్ర‌కారు హృద‌యాల‌ను మెలిపెట్టిన ఈ బ్యూటీ విష్ణు మంచు స‌ర‌స‌న ఆర్జీవీ డైరెక్ష‌న్ లో ఎటాక్ సినిమాలో న‌టించింది. గ్లామ‌ర్ ఎలివేష‌న్ ప‌రంగా హ‌ద్దులు చెరిపేసి చెల‌రేగిపోయింది. అయినా ఇవేవీ క‌లిసి రాలేదు. శాన్వీ పూర్తిగా క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌కే అంకిత‌మైంది. బ‌హుభాషా చిత్రం `శ్రీ‌మ‌న్నారాయ‌ణ`లో ర‌క్షిత్ శెట్టి స‌ర‌సన న‌టించి మెప్పించింది.


శాన్వి న‌టించిన మ‌హా వీర్యార్ విడుద‌లై రెండేళ్ల‌యింది. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల సామాజిక మాధ్య‌మాల్లో సినిమా ఫోటోల‌ను షేర్ చేసుకుని ఆనందం వ్య‌క్తం చేసింది. తాను ఇప్ప‌టివ‌ర‌కూ చేసిన వాటిలో అత్యంత స్వ‌చ్ఛ‌మైన పాత్ర దేవ‌యానిలో న‌టించానని వెల్ల‌డించింది. ఇక దీంతో పాటు సామాజిక మాధ్య‌మాల్లో ఈ భామ నిరంత‌ర ఫోటోషూట్లతో వేడెక్కిస్తూనే ఉంది. ఇప్ప‌టికే ఇన్ స్టాలో ల‌క్ష‌లాదిగా ఫాలోవ‌ర్స్ ఉన్న ఈ బ్యూటీ..లేటెస్ట్ ఫోటోషూట్ తో మ‌రోసారి క‌వ్వించింది.


శాన్వి తాజా ఫోటోషూట్ అభిమానుల్లోకి వైర‌ల్ గా దూసుకెళుతోంది. శాన్వి ప్ర‌స్తుతం మాల్దీవుల విహారంలో ఎంజాయ్ చేస్తోంది. అక్క‌డ కొద్ది రోజులుగా విలాసాల‌ను ఆస్వాధిస్తోంది. తాజాగా బికినీలో శాన్వి జిల్ల‌నిపించింది. చిరుత తోలు బికినీలో శాన్వి అంద‌చందాలు కుర్ర‌కారు మ‌తులు చెడ‌గొడుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.


శాన్వీ శ్రీ‌వ‌త్స‌వ‌ ఇటీవ‌ల‌ త్రిశూలం - బ్యాంగ్ అనే రెండు కన్న‌డ‌ చిత్రాల్లో న‌టించింది. బ్యాంగ్ చిత్రం గ‌త ఏడాది ఆగ‌స్టులో విడుద‌లై మిశ్ర‌మ స్పంద‌న‌లు అందుకుంది. త్రిశూలం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. అలాగే శాన్వి మ‌హావీర్యార్ చిత్రంతో మ‌ల‌యాళంలోను అడుగుపెట్టింది. త‌దుప‌రి ఓ వెబ్ సిరీస్ కోసం క‌థ వింటోంద‌ని తెలిసింది. క‌న్న‌డ సినిమా ఉగ్రం రీమేక్ తో మ‌రాఠాలోకి ఈ భామ అడుగుపెడుతోంది. రాంతి అనేది అక్క‌డ టైటిల్.

Tags:    

Similar News