స్టార్ హీరో 300 కోట్ల ఇంటికి అనుమ‌తి క‌ష్ట‌మే!

కింగ్ ఖాన్ షారూఖ్ కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా 6500కోట్లు పైగా నిక‌ర‌ ఆస్తులు ఉన్నాయ‌ని క‌థ‌నాలొచ్చాయి. అత‌డికి ముంబైలో అత్యంత ఖ‌రీదైన ఇల్లు కూడా ఉంది. ఐకానిక్ సీఫేసింగ్ ముంబై హోమ్ `మన్నత్` మార్కెట్ విలువ దాదాపు 300 కోట్లు.

Update: 2024-12-12 03:44 GMT

కింగ్ ఖాన్ షారూఖ్ కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా 6500కోట్లు పైగా నిక‌ర‌ ఆస్తులు ఉన్నాయ‌ని క‌థ‌నాలొచ్చాయి. అత‌డికి ముంబైలో అత్యంత ఖ‌రీదైన ఇల్లు కూడా ఉంది. ఐకానిక్ సీఫేసింగ్ ముంబై హోమ్ `మన్నత్` మార్కెట్ విలువ దాదాపు 300 కోట్లు. ముంబై లో ఈ ఇల్లు ఒక‌ ల్యాండ్‌మార్క్‌గా పాపుల‌రైంది. ఈ ఇంటి వ‌ద్ద‌కు తమ అభిమాన హీరోని చూసేందుకు ప్రతిరోజూ వేలాది మంది అభిమానులు విచ్చేస్తుండ‌డంతో అది టూరిస్ట్ స్పాట్ గా మారింది.

తాజా స‌మాచారం మేర‌కు.. కోస్ట‌ల్ జోన్‌లో ఉన్న ఈ ఇంటికి మ‌రో రెండు అంత‌స్తులు చేర్చేందుకు షారూఖ్‌-గౌరీఖాన్ ప్ర‌ణాళిక‌ల్లో ఉన్నార‌ని తెలుస్తోంది. ఇంటీరియర్ డిజైనర్ అయిన షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ నవంబర్ 2024లో మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ (MCZMA)కి అధికారిక దరఖాస్తును సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ దరఖాస్తు ప్రకారం.. ప్రస్తుతం ఉన్న `మన్నత్`కి మరో రెండు అంతస్తులను జోడించడానికి అనుమతిని మంజూరు చేయాల్సిందిగా వారు కోరుతున్నారు. గౌరీ ఖాన్ సమర్పించిన ఈ దరఖాస్తును డిసెంబర్ 10, 11 తేదీల్లో MCZMA తన తాజా సమావేశంలో సమీక్షించింది. అయితే ఈ అద‌న‌పు అంత‌స్తుల నిర్మాణానికి మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం స‌హ‌క‌రిస్తుందా లేదా? కోస్ట‌ల్ జోన్ స‌మీక్ష‌లో ఏం తేల్చింది? అనే వివ‌రాలు ఇంకా అందుబాటులోకి రాలేదు.

ఒక‌వేళ ఇంటి విస్తరణకు అనుమతి ద‌క్కితే.. దానికోసం షారూఖ్ మ‌రో రూ. 25 కోట్లు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంద‌ని స‌మాచారం. అయితే మ‌న్న‌త్ వార‌సత్వ సంప‌ద‌. 1914లో నిర్మించిన `మన్నత్‌`కు వారసత్వ ఆస్తి హోదా ఉన్నందున ఈ ప్రక్రియ స్టార్ కపుల్‌కి అంత సులువు కాద‌ని కూడా విశ్లేషిస్తున్నారు. ఖాన్ ఫ్యామిలీ హోమ్ 2091.38 చదరపు మీటర్ల ప్లాట్ సైజుతో ఉంది. ఇప్పటికే మ‌న్న‌త్ భ‌వంతిలో ఆరు అంతస్తులు ఉన్నాయి. మ‌రో రెండు అంత‌స్తుల‌ను జోడిస్తే అది ఎనిమిది అంత‌స్తుల‌కు పెరుగుతుంది. ఇప్ప‌టి మార్కెట్ విలువ‌ను బ‌ట్టి దాదాపు 300 కోట్ల విలువ చేసే ఈ భ‌వంతిలో ఐదు బెడ్‌రూమ్‌లు, ఒక ప్రైవేట్ సినిమా థియేటర్, ఫిట్‌నెస్ హబ్, స్విమ్మింగ్ పూల్, విలాసవంతమైన లైబ్రరీ, అద్భుతమైన డాబా ఉన్నాయి.

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌విస్ తో షారూఖ్ -గౌరీఖాన్ కుటుంబానికి స‌త్సంబంధాలున్నాయి. అందువ‌ల్ల మ‌న్న‌త్ ఎక్స్ టెన్ష‌న్ అనుమ‌తులు పొంద‌డం క‌ష్టం కాద‌ని విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News