హీరోయిన్ ఒళ్లు హూనమైపోతుందా!
తాజాగా ఆన్ సెట్స్ అనుభవాలు పంచుకుంది. అవేంటో ఆమె మాటల్లోనే..
బాలీవుడ్ యంగ్ బ్యూటీ శర్వారీ వాఘ్ గురించి పరిచయం అవసరం లేదు. అమ్మడి కెరీర్ బాలీవుడ్లో సక్సస్ పుల్ గా దూసుకుపోతుంది. ఇప్పుడున్న యువ నాయికల్లో శర్వారీ వాఘ్ జోష్ మామూలుగా లేదు. మిగతా వారందరికంటే బెటర్ గా ముందుకెళ్తుంది. ఇటీవలే హ్యాట్రిక్ విజయాలు సైతం ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అలియాట్ తో కలిసి యాక్షన్ స్పై థ్రిల్లర్ `ఆల్పా`లో నటిస్తోంది. యశ్ రాజ్ ఫిలింస్ తొలిసారి ఇద్దరు లేడీ నటీనటులతో స్పై చిత్రాన్ని నిర్మించడం విశేషం.
ఈ చిత్రాన్ని శివ్ రావేల్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో అవకాశం పట్ల అమ్మడు సంతోషం వ్యక్తం చేసింది. తాజాగా ఆన్ సెట్స్ అనుభవాలు పంచుకుంది. అవేంటో ఆమె మాటల్లోనే..` బాల్యం నుంచే నా సొదరితో కలిసి యాక్షన్ చిత్రాలు ఎక్కువగా చూసేదాన్ని. అన్నింటికంటే ఈజానర్ ని ఎక్కువగా ఇష్టపడతా. అందుకే నాకు `ఆల్పా`లో అవకాశం వచ్చినప్పుడు ఎగిరి గంతులేసా. యాక్షన్ చిత్రాల్లో భారీ యాక్షన్ సన్నివేశాల్లో నటించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉండేది. ఆల్పా ద్వారా ఆ డ్రీమ్ నెరవేరుతుంది.
చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ షూటింగ్ చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడు తున్నా. ఒళ్లంతా హూనమవుతుంది. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో రోజంతా వాటి షూట్ తోనే గడపాల్సి వస్తోంది. సెట్స్ కి వెళ్లిన సమయం నుంచే యాక్షన్ సన్నివేశాలు మొదలవుతున్నాయి. అటుపై డే వాటితోనే ముగుస్తుంది. అందుకే ఒళ్లంతా నొప్పులుగా ఉంటుంది. కానీ ఇలాంటి సన్నివేశాల్లో నటించడం మాత్రం గొప్ప అనుభూతిగా ఫీలవుతున్నా.
నా డ్రీమ్ రోల్ కావడంతో ఎంత కష్టమైనా ఇష్టంగానే పనిచేస్తున్నా. ఆల్పా ద్వారా ప్రేక్షకులు నన్ను కచ్చితంగా ఇష్టపడతారని చెప్పగలను. కేవలం రెండు సన్నివేశాలు , మూడు ప్రేమ పాటల్లో నటించే నటిగా కాకుండా భవిష్యత్ లో యాక్షన్ స్టార్ గా ఉండాలనుకుంటున్నా. ఇలాంటి పాత్రలు ఎన్ని చేయమన్నా చేయడానికి సిద్దంగానే ఉంటాను` అని అంది.