పిక్‌ టాక్ : బాబోయ్‌ ఏం వర్కౌట్ అందం

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న హీరోయిన్స్‌ పేర్లలో శార్వరి వాఘ్‌ పేరు ఒకటి అనడంలో సందేహం లేదు.

Update: 2025-02-24 00:00 GMT

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న హీరోయిన్స్‌ పేర్లలో శార్వరి వాఘ్‌ పేరు ఒకటి అనడంలో సందేహం లేదు. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌ టీంలో మెంబర్‌గా తన సినీ కెరీర్‌ను ఈ అమ్మడు ప్రారంభించింది. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. సహాయ దర్శకురాలిగా చేస్తూనే నటిగా అవకాశాలు దక్కించుకుంది. యష్ రాజ్ ఫిల్మ్స్‌ నుంచి వచ్చిన బంటీ ఔర్‌ బల్లీ 2 సినిమాతో నటిగా శార్వతి వాఘ్ తన నటన ప్రస్థానం మొదలు పెట్టింది. గత ఏడాది ఆమె పూర్తి స్థాయి నటిగా మారింది. ఏకంగా మూడు సినిమాలతో గత ఏడాది శార్వరి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ముంజ్యా సినిమాలో మెయిన్‌ లీడ్‌గా నటించిన శార్వరి వాఘ్‌ మహారాజ్ సినిమాలో గెస్ట్‌ అప్పియరెన్స్ ఇచ్చింది. వేదం సినిమాలోనూ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఆల్ఫా సినిమాలో నటిస్తోంది. శార్వరి తో వర్క్ చేయడం కోసం యంగ్‌ హీరోలు సైతం ఆసక్తిగా ఉన్నారు. దాంతో ఈ ఏడాదిలో ఆమె నుంచి మరో రెండు మూడు సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్న హీరోయిన్స్‌తో పోల్చితే ఈ హీరోయిన్‌ అంతంతో పాటు నటన పరంగానూ మంచి మార్కులు దక్కించుకుంటుంది అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హీరోయిన్‌గా బిజీ అవుతున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో అందాల ఆరబోతతో సర్ప్రైజ్‌ చేస్తోంది. రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. దాదాపుగా మూడు మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈ అమ్మడు తాజాగా వర్కౌట్ ఫోటోను షేర్‌ చేసింది. బ్లాక్ టైట్‌ వర్కౌట్‌ సూట్‌లో శార్వరీ అందం మెరిసి పోతుంది. రోప్‌తో ఈ అమ్మడు చేస్తున్న వర్కౌట్‌లు అందరిని సర్‌ప్రైజ్ చేసింది. ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తూ వర్కౌట్‌ చేయడం అవసరమా అంటూ కొందరు కౌంటర్‌ వేస్తున్నారు. మొత్తానికి నెట్టింట ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు మరోసారి వైరల్‌ అవుతున్నాయి.

క్లీ వేజ్ షోతో మతి పోగొడుతున్న శర్వారి రాబోయే రోజుల్లో సౌత్‌ సినిమాల్లోనూ నటించాలని కొందరు కోరుకుంటున్నారు. మరాఠీ ఫ్యామిలీలో జన్మించిన ఈ అమ్మడు ముంబైలోని ది దాదర్ పార్సీ యూత్స్ అసెంబ్లీ హౌ స్కూల్‌లో చదువుకుంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ జోషికి ఈమె బంధువు. సోను కే టిటు కి స్వీటీ చిత్రానికి సహాయ దర్శకురాలిగా చేసింది. నటిగా బిజీగా ఉన్న ఈ అమ్మడు భవిష్యత్తులో డైరెక్షన్ చేస్తానంటూ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News