15 ఎక‌రాల్లో భారీ సెట్..అక్క‌డేం జ‌రుగుతోంది?

శ‌ర్వానంద్ మునుపెన్న‌డు పోషించిన వినూత్న‌మైన పాత్ర పోషిస్తున్నాడు. అత‌డి లుక్..హార్యం ప్ర‌తీది కొత్త‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది. 1960

Update: 2024-10-19 00:30 GMT

ఇటీవ‌లే యంగ్ హీరో శ‌ర్వానంద్ 28వ చిత్రం సంపత్ నంది ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామాగా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇంత‌వ‌ర‌కూ పీరియాడిక్ చిత్రాల్లో శ‌ర్వానంద్ న‌టించ లేదు. అలాగే ఆయ‌న కెరీర్ లో తొలి భారీ బ‌డ్జెట్ చిత్రం కూడా ఇదే. ప్ర‌స్తుతం ఆ సినిమా ప‌నులు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. దీనిలో భాగంగా హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో ఏకంగా 15 ఎక‌రాల్లోనే ఓ భారీ సెట్ వేస్తున్న‌ట్లు స‌మాచారం.

శ‌ర్వానంద్ మునుపెన్న‌డు పోషించిన వినూత్న‌మైన పాత్ర పోషిస్తున్నాడు. అత‌డి లుక్..హార్యం ప్ర‌తీది కొత్త‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది. 1960 కాలం నాటి స్టోరీ కావ‌డంతో అలాంటి వాతావ‌ర‌ణం రీ క్రేయ‌ట్ చేయ‌డం కోసం 15 ఎక‌రాల్లో సెట్లు వేస్తున్నారు. ఇంత‌వ‌ర‌కూ ఇలాంటి భారీ సెట్ లో శర్వానంద్ ఏ సినిమా షూటింగ్ జ‌ర‌గ‌లేదు. ఆ ర‌కంగా ఇది ఆయ‌న‌కు కొత్త ఎక్స్ పీరియ‌న్స్ అనొచ్చు. సాధారంగా ఇలా ఎక‌రాల్లో సెట్లు వేయ‌డం అంటే రాజ‌మౌళి సినిమాల‌కే క‌నిపిస్తుంటుంది.

రామోజీ ఫిలిం సిటీలో సెట్లు వేస్తుంటారు. లేదా అక్క‌డ ఉన్న స‌హ‌జ గ్రీన‌రీని షూటింగ్ ప‌ర్ప‌స్ లో వినియోగిం చుకుంటారు. శ‌ర్వా సినిమా కోసం 16 ఎక‌రాల్లో సెట్లు అంటే వాటి కోసం భారీగా ఖ‌ర్చు అవుతుంది. ఆర్ట్ డైరెక్ట‌ర్ కిర‌ణ్ కుమార్ మ‌న్నే ఆధ్వ‌ర్యంలో ఈ సెట్ నిర్మాణం జ‌రుగుతుంది. మ‌రి సెట్ నిర్మాణం పూర్త‌వ్వ‌డానికి ఎంత స‌మ‌యం ప‌డుతుందో చూడాలి. అనంత‌రం యూనిట్ షూటింగ్ కి వెళ్తారు.

కొంత కాలంగా శ‌ర్వా-సంపత్ ల‌కు స‌రైన స‌క్సెస్ లు ప‌డ‌లేదు. ఇద్దరు స‌క్స‌స్ దాహంలో చేస్తోన్న చిత్రం కావ‌డంతో మ‌రింత క‌సిగా ప‌నిచేస్తారు. తెలుగు సినిమా పాన్ ఇండియా క్రేజ్ ని దృష్టిలో పెట్టుకునే ఈ చిత్రాన్ని ప్లాన్ చేసుకు న్న‌ట్లు తెలుస్తోంది. అయితే యూనిట్ ఇంకా ఆరంభ ద‌శ‌లో ఉండ‌టంతో పెద్ద‌గా ప్ర‌మోట్ చేయ‌డం లేదు. రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైన త‌ర్వాత అప్ డేట్స్ ఇచ్చే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News