1960 వాస్తవ ఘటనతో శర్వానంద్ సినిమా!
అలాగే మాస్ డైరెక్టర్ సంపత్ నందితో కూడా శర్వా ఓ సినిమా చేస్తాడని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనికి సంబంధించిన అప్ డేట్ వచ్చింది.;

యంగ్ హీరో శర్వానంద్ కి సరైన సక్సెస్ పడి చాలా కాలమవుతోంది. చేస్తోన్న ప్రయత్నాలేవి ఫలించడం లేదు. ప్రస్తుతం ఓ మూడు సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. అవి చిత్రీకరణ మొల్లగా జరుగుతున్నాయి. వాటి రిలీజ్ లపై ఇంతవరకూ క్లారిటీ కూడా లేదు. అలాగే మాస్ డైరెక్టర్ సంపత్ నందితో కూడా శర్వా ఓ సినిమా చేస్తాడని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనికి సంబంధించిన అప్ డేట్ వచ్చింది.
ఈ చిత్రాన్ని కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కించనున్నట్లు సంపత్ రివీల్ చేసాడు. 1960 లో మహరాష్ట్ర-అదిలాబాద్ సరిహద్దు గ్రామంలో చోటుచేసుకున్న ఓ సంచలన ఘటన స్పూర్తితో ఈ సినిమా ఉంటుందన్నారు. ఆ సంఘటనల్నే ఫిక్షన్ గా మార్చి సినిమా తీస్తామని తెలిపారు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి మొదలైంది. ఇంతవరకూ శర్వానంద్ వాస్తవ సంఘటనలు ఆధారంగా ఏ సినిమా చేయలేదు.
సంపత్ నంది కూడా అలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఆ ద్వయం రియల్ ఇన్సిండెంట్ ని కథా వస్తువుగా తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. కమర్శియల్ సినిమాలు తీయడంలో సంపత్ నంది స్పెషలిస్ట్. అయితే అదంతా ఇప్పుడు ఓల్డ్ ట్రెండ్. కమర్శియల్ సినిమాలకు పెద్దగా ఆదరణ దక్కలేదు. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ లకు ప్రేక్షకులు పెద్ద పీట వేస్తున్నారు. ఈ నేపత్యంలో సంపత్ నందికి దర్శకుడిగా అవకాశాలు కూడా తగ్గాయి.
ఆ మధ్య అనుకున్న ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. దీంతో సంపత్ కూడా రూట్ మార్చాడు. ఈ నేపథ్యంలో రియల్ ఇన్సిడెంట్ పై పడ్డట్లు కనిపిస్తుంది. అలాగే నిర్మాతగానూ సంపత్ నంది బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలకు తానే స్టోరీ అందించి నిర్మాణంలోనూ భాగమవుతున్నాడు. ప్రస్తుతం తమన్నా మెయిన్ లీడ్ లో నటిస్తోన్న `ఓదెల-2` అలా తెరకెక్కుతోన్న చిత్రమే.