తండ్రి ఎఫైర్‌పై మౌనం వీడిన స్టార్ డాటర్
అయితే షాట్ గన్ గా సుప్రసిద్ధుడైన శత్రుఘ్న జీ జీవితంలోను అలాంటి ఒక సంక్లిష్ఠ పరిస్థితి ఉంది. చాలామందికి ఇది తెలీదు
సోనాక్షి సిన్హా- జహీర్ ఇక్బాల్ ఎట్టకేలకు అందరి ఆశీస్సులతో పెళ్లితో ఒకటయ్యారు. మొదట్లో సోనాక్షి కుటుంబంతో సమస్యలేర్పడ్డాయి కానీ ప్రేమ అందరినీ జయించింది. ఒకప్పుడు అదే తీరుగా ప్రేమ విరహంలో చిక్కుకున్న.. సంక్లిష్టమైన అనుభూతిని ఎదుర్కొన్న శతృఘ్న కంటే ప్రేమలో కాంప్లికేషన్ ను ఇంకెవరు బాగా అర్థం చేసుకుంటారు? ఆయన తన కుమార్తె మనసును అర్థం చేసుకున్నారు. ఆశీస్సులు అందించారు. పెళ్లికి వచ్చారు. నవవధూవరులను ధీవించారు. తాము సంతోషంగా తమ కుమార్తెను అత్తారింటికి సాగనంపుతున్నామని శత్రుఘ్న సిన్హా తెలిపారు.
అయితే షాట్ గన్ గా సుప్రసిద్ధుడైన శత్రుఘ్న జీ జీవితంలోను అలాంటి ఒక సంక్లిష్ఠ పరిస్థితి ఉంది. చాలామందికి ఇది తెలీదు. సోనాక్షికి తెలిసినంతగా... శత్రుఘ్న సిన్హా తన సహనటి రీనా రాయ్‌తో ప్రేమలో ఉన్న సమయమది. అతడు పూనమ్ సిన్హాతో ప్రేమలో ఉండగానే.. రీనాతోను ప్రేమలో పడ్డాడు. అతడు రీనాను చాలా తీవ్రంగా కోరుకున్నాడు. అతడు ఆమెను వివాహం చేసుకున్నాడు.
సోనాక్షి తల్లి పూనమ్‌తో పెళ్లి తర్వాత శత్రుఘ్న సిన్హా తన తొలి ప్రేమ రీనా రాయ్ వద్దకు మళ్లీ వెళ్ళాడు. సోనాక్షి సిన్హాను తన కుటుంబంలో సమస్య గురించి..తన తండ్రి వివాహేతర సంబంధం గురించి మీడియా ప్రశ్నించింది. అయితే దానికి సోనాక్షి చాలా పరిణతితో సమాధానం ఇచ్చింది. ఆ సమాధానం చాలా క్రూరంగా నిజాయితీగా ఉంది.
మసాలా డాట్ కాం ప్రకారం...సోనాక్షి ఇలా అన్నారు. ``నేను పుట్టనప్పుడు ఇది జరిగిందని నేను అనుకుంటున్నాను. నేను పెరుగుతున్నప్పుడు నెమ్మదిగా విషయాలను అర్థం చేసుకోవడం ప్రారంభించాను. కానీ కొన్నేళ్ల క్రితం చేసిన పనికి నేను నా తండ్రిని సిలువ వేయను. ఇది అతడి గతం. ప్రతి ఒక్కరికీ గతం ఉంటుంది. కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించను. అలాగే నేను దానిపై శ్రద్ధ పెట్టను. నేను చెప్పినట్లుగా ఇది కొందరికి నిజంగా మంచి హెడ్ లైన్ ని.. రసవంతమైన గాసిప్లను అందిస్తుంది. కానీ నాకు ఇది నా కుటుంబం`` అని సోనాక్షి అన్నారు.
సోనాక్షి దబాంగ్‌తో పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు శత్రుఘ్న సిన్హా- రీనా రాయ్‌ల ఎఫైర్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. సోనాక్షి రూపాన్ని రీనా రాయ్‌తో పోల్చారు. కానీ తను అనేక ఇంటర్వ్యూలలో నేను నా తల్లిలా కనిపిస్తున్నాను అని వేడుకుంది. తరువాత రీనా రాయ్ కూడా దీనిని గాసిప్ అని అన్నారు. సోనాక్షి పూనమ్ సిన్హాలా ఉందని రీనా అంగీకరించింది.