నెలకు రెండు స్టెరాయిడ్స్.. పాపం ఆ హీరోయిన్..!

ప్రస్తుతం మలయాళ భామ షాన్ రోమీ ఇలాంటి ఒక అరుదైన అనారోగ్య సమస్యతో బాధపడుతుంది.

Update: 2025-01-04 18:30 GMT

తెర మీద అందంగా కనిపించే కథానాయికలు ప్రేక్షకులను అలరించేందుకు అలా సిద్ధమవుతారు. దాని కోసం వారు ఎన్నో జాగ్రత్తలు వహిస్తారు. అంతేకాదు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా కథానాయికగా తెర మీద అందంగా కనిపించేందుకు ఎన్నో రకాల కాస్మొటిక్స్ వాడుతుంటారు. వాటి వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అందంగా కనిపించాలని ముఖానికి మేకప్ వేసుకుంటారు. ఐతే ఇది వారి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని తెలిసినా సరే అలానే కొనసాగిస్తారు.


ఏదైనా సమస్య వచ్చినప్పుడే వారి లోపల ఉన్న అనారోగ్యం బయట పడుతుంది. ప్రస్తుతం మలయాళ భామ షాన్ రోమీ ఇలాంటి ఒక అరుదైన అనారోగ్య సమస్యతో బాధపడుతుంది. 2024 తన లైఫ్ లో చాలా దారుణమైన సంవత్సరమని.. ఏడాది ఎంతో కష్టంగా గడిచింది అని షాన్ రోమీ తన సోషల్ మీడియా లో వెల్లడించింది. ఆటో ఇమ్యూన్ తగ్గిపోవడం వల్ల దారుణమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పింది.

అనారోగ్య సమస్య వల్ల జుట్టు ఊడిపోతుంది. ఐతే స్నేహితులురాలి సలహా వల్ల ఒక పరిష్కారం దొరికిందని అన్నరి షాన్ రోమీ. తన వెంట్రుకల కోసం నెలలో రెండుసార్లు స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పింది షాన్ రోమీ. కథానాయికలు పడే ఈ బాధలు ఎవరికీ తెలియదు సిల్వర్ స్క్రీన్ పై గ్లామ్ర్ గా కనిపించే ప్రతి హీరోయిన్ వెనక కూడా ఇలాంటి ఒక కథ ఉంటుంది.

షాన్ రోమీ మలయాళంలో లూసిఫర్, హృదయం సినిమాలతో పాటు బ్లూ సైస్, గ్రీన్ వాటర్స్ ఇంకా రెడ్ ఎర్త్ సినిమాల్లో నటించింది అమ్మడు. ఐతే షాన్ రోమీ పరిస్థితి తెలిసిన సినీ ప్రియులు షాక్ లో ఉన్నారు. గ్లామర్ గా కనిపించాలనుకునే ప్రతి హీరోయిన్ ఎంతోకొంత రిస్క్ తీసుకోక తప్పదు. ఐతే తాము ఏం చేసినా సరే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికే అని స్టార్స్ భావిస్తారు. కానీ వాళ్లు ఆఫ్ స్క్రీన్ పడే బాధలు ఎవరు పట్టించుకోరు. ఇంకా కాస్త తెర మీద అందంగా కనిపించే హీరోయిన్ ఆఫ్ స్క్రీన్ లో కాస్త తేడాగా కనిపిస్తే చాలు ఒక ఆట ఆడేసుకుంటారు. ఐతే షాన్ రోమీ ఈ పరిస్థితి రావడానికి గల కారణాలు ఏంటన్నది మాత్రం వెల్లడించలేదు. కేవలం ఆటో ఇమ్యునిటీ లోపం వల్ల అమ్మడు తన మునుపటి రూపాన్ని పూర్తిగా కోల్పోయి అనారోగ్యంగా తయారైంది.

Tags:    

Similar News