'ఆరెంజ్' హీరోయిన్ ఎంగేజ్మెంట్ అయిపోయిందోచ్.. పిక్స్ చూశారా?
రీసెంట్ గా ప్రియుడు ఆశిష్ కనకియాతో షాజన్ ఎంగేజ్మెంట్ అయింది. జనవరి 20వ తేదీన ఆశిష్ తో రోకా జరిగినట్లు వెల్లడించింది షాజన్.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీ గురించి అందరికీ తెలిసిందే. బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా భాస్కర్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. కానీ భారీ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. మూవీలోని ప్రతి ఒక్క పాట.. ఇప్పటికే ఎవర్ గ్రీన్ గా ఉంటుందని చెప్పాలి.
ఆ సినిమాలో రామ్ చరణ్, జెనీలియా జంటగా నటించగా.. హీరో లవర్ గా షాజన్ పదంసీ కనిపించిన సంగతి తెలిసిందే. ఒక్క సినిమాతో ఆమె ఫుల్ పాపులర్ అయిపోయింది. చరణ్, షాజన్ మధ్య వచ్చే సాంగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేరే లెవెల్ లో హిట్ అయింది. ఇప్పుడు ఆమె.. తన ప్రియుడిని పెళ్లి చేసుకోనుంది.
రీసెంట్ గా ప్రియుడు ఆశిష్ కనకియాతో షాజన్ ఎంగేజ్మెంట్ అయింది. జనవరి 20వ తేదీన ఆశిష్ తో రోకా జరిగినట్లు వెల్లడించింది షాజన్. అందుకు సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ.. న్యూ బిగినింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. గతేడాది నవంబర్ లో ఆశిష్ ను పరిచయం చేసిన షాజన్.. పెళ్లి త్వరలో ఘనంగా జరగనుంది.
దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో షాజన్ రోకా పిక్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమెకు బెస్ట్ విషెస్ చెబుతున్నారు. ఫోటోలు చాలా బాగున్నాయని కామెంట్లు పెడుతున్నారు. పెయిర్ సూపర్ గా ఉందని చెబుతున్నారు. అయితే రోకా అంటే.. ఉత్తరాదిలో ఆ రోజుతో పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయి. అన్నీ మొదలుపెట్టేస్తారు.
దాని గురించి తెలుగు వారికి తెలియకపోవచ్చు. ఓ విధంగా ఎంగేజ్మెంట్ లాంటిదేనని చెప్పవచ్చు. అందుకే #roka #engagement అంటూ షాజన్ రాసుకొచ్చింది. అయితే మూవీల్లోకి రాకముందు.. వాణిజ్య ప్రకటనల ద్వారా అందరినీ అలరించిన అమ్మడు.. రాకెట్ సింగ్: సేల్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ తో సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది.
కనిమొళి మూవీలో కోలీవుడ్ కు వెళ్లిన షాజన్.. దిల్ తో బచ్చా హై జీ, హౌస్ ఫుల్ 2 వంటి పలు సినిమాలతో మెప్పించింది. తెలుగులో ఆరెంజ్ తర్వాత రామ్ మసాలాతో నటించి ఆకట్టుకుందనే చెప్పాలి. ఇప్పుడు సినిమాలకు కాస్త దూరంగానే ఉన్న అమ్మడు.. త్వరలో తన ప్రియుడితో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది.