హార్థిక్ గురించి అలా.. ధావన్ గురించి ఇలా..!
గత కొద్దిరోజులుగా టీమిండియా ట్యాలెంటెడ్ క్రికెటర్ హార్థిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం గురించి విచారకరమైన రూమర్లు పుట్టుకొస్తున్నాయి.
గత కొద్దిరోజులుగా టీమిండియా ట్యాలెంటెడ్ క్రికెటర్ హార్థిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం గురించి విచారకరమైన రూమర్లు పుట్టుకొస్తున్నాయి. అతడు తన భార్య నటాషా స్టాంకోవిక్ నుంచి విడిపోతున్నాడని ప్రచారమవుతోంది. దీనిపై అభిమానులు ఆందోళనగా ఉన్నారు. ఆ ఇద్దరూ విడివిడిగా ఉండడంతోనే ఈ పుకార్లు షికార్ చేస్తున్నాయి.
ఇదిలా ఉండగానే తనపై జరిగిన ఓ తప్పుడు ప్రచారం గురించి మరో యువ క్రికెటర్ శిఖర్ ధావన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తన చుట్టూ ముసురుకున్న పుకార్ల గురించి హాస్యాస్పద స్టోరీని రివీల్ చేసాడు. లెజెండరీ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్‌తో తన వివాహం గురించి ఒకప్పుడు పుకార్లు పుట్టుకొచ్చాయని, ఎలాంటి అవకాశం లేని జంట గురించి ఇలాంటి పుకార్లు పుట్టించారని ధావన్ అన్నారు.
జియో సినిమా షో `ధావన్ కరేంగే`లో మాట్లాడుతూ ఈ అందమైన గాసిప్ గురించి ప్రస్థావించాడు. నేను మిథాలీ రాజ్‌ని పెళ్లి చేసుకోబోతున్నానని విన్నాను! అని చెప్పాడు. ఇది అభిమానులలో నవ్వు తెప్పించింది. ధావన్ లైటర్ వెయిన్ స్వభావాన్ని .. అలాంటి పుకార్లను అతడు లైట్ తీసుకునే సామర్థ్యాన్ని అంతా అర్థం చేసుకున్నారు.
అక్షయ్ తో ఎపిసోడ్ లో..!
ఇటీవల ఖిలాడీ అక్షయ్ కుమార్ శిఖర్ షోలో కనిపించారు. అక్కీ తన కొడుకు ఆరవ్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు. నా కొడుకు ఆరవ్ లండన్‌లోని విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. అతను 15 సంవత్సరాల వయస్సులో ఇంటి నుండి స్టడీస్ కోసం వెళ్లాడు. అతడు ఎప్పుడూ చదువులను ఇష్టపడేవాడు. ఒంటరిగా ఉండాలనుకున్నాడు.
ఆరవ్ విదేశాలకు ఒంటరిగా వెళ్లడం ఇష్టం లేకపోయినా వెళ్లాలన్నది అతడి నిర్ణయం. నేను ఆపలేకపోయాను ఎందుకంటే నేను 14 సంవత్సరాల వయస్సులో నా ఇంటిని వదిలి వెళ్ళాను ... అతడు తన సొంత లాండ్రీ చేస్తాడు. అతడు మంచి వంటవాడు.. పాత్రలు శుభ్రం చేస్తాడు.. ఖరీదైన బట్టలు కొనడానికి కూడా ఇష్టపడడు. డబ్బును వృధా చేయడం ఇష్టం లేనందున బట్టలు కొనడానికి పొదుపు అనే సెకండ్ హ్యాండ్ దుకాణానికి వెళ్తాడు అని తెలిపాడు.