పిక్ టాక్ : ఈమెకు 49 ఏళ్లు అంటే నమ్ముతారా?
శిల్పా శెట్టి పెళ్లి అయిన ఇన్ని సంవత్సరాల తర్వాత, ఈ వయసులోనూ ఇంత ఫిట్‌గా ఉండటం గొప్ప విషయం, ఈమె ఎంతో మందికి ఆదర్శం.
తెలుగు ప్రేక్షకులకు 1996లో సాహస వీరుడు సాగర కన్య సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ శిల్పా శెట్టి. ఈమె ఇండస్ట్రీలో అడుగు పెట్టి 30 ఏళ్లు పూర్తి అయినా ఇప్పటికీ ఆమె అంటే ఇష్టపడే వారు ఎంతో మంది ఉంటారు. ఆమె సినిమాలు చేసినా చేయకున్నా ఒక వర్గం ప్రేక్షకులు ఆమె కదిలినా వావ్ అంటూ అభిమానం చూపిస్తూ ఉంటారు.
అంతటి అభిమానులను సొంతం చేసుకున్న శిల్పా శెట్టి వయసు ప్రస్తుతం 49 ఏళ్లు. ఈ వయసులో సాధారణంగా ఆడవారు ఎక్కువ శాతం మంది పూర్తిగా ఇంటికే పరిమితం కావడం లేదంటే అందం తగ్గడంతో తెర వెనక్కి వెళ్లడం చేస్తూ ఉంటారు.
శిల్పా శెట్టి మాత్రం ఈ వయసులోనే పాతికేళ్ల పడుచు అమ్మాయిలకు పోటీ ఇచ్చేంత అందంగా కనిపిస్తూ ఉన్నారు. శిల్పా నటి మాత్రమే కాకుండా యోగా ట్రైనర్‌గా కూడా వ్యవహరిస్తూ ఉంటుంది. అందుకే ఆమె ఫిజిక్ ఇప్పటికీ పాతికేళ్ల అమ్మాయి మాదిరిగానే ఉంటుంది. ఎక్కడా వయసు లక్షణాలు కనిపించవు. అంతే కాకుండా ఆమె మొహం మూడు పదుల సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడూ అలాగే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంకాస్త ఎక్కువ అందంగా శిల్పా కనిపిస్తారు అంటూ అభిమానులతో పాటు సోషల్ మీడియాలో నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం.
రెగ్యులర్‌గా శిల్పా శెట్టి తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. బుల్లి తెరపై అప్పుడప్పుడు వెండి తెరపై సందడి చేస్తున్న శిల్పా శెట్టి సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈసారి జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియోలను షేర్ చేసింది. ఈ అందమైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మినీ షార్ట్ ధరించిన శిల్పా స్పోర్ట్స్ టాప్‌ను ధరించి నడుము అందం చూపిస్తోంది. సాధారణంగానే శిల్పా శెట్టి చాలా అందంగా ఉంటారు. ఇప్పుడు ఈ ఔట్ ఫిట్‌లో చూపు తిప్పుకోనివ్వడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
శిల్పా శెట్టి పెళ్లి అయిన ఇన్ని సంవత్సరాల తర్వాత, ఈ వయసులోనూ ఇంత ఫిట్‌గా ఉండటం గొప్ప విషయం, ఈమె ఎంతో మందికి ఆదర్శం. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోయిన్స్ శిల్పా శెట్టిని ఆదర్శంగా తీసుకుని ఫిట్‌గా ఉండాలంటూ కొందరు సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికీ యంగ్ హీరోలకు జోడీగా హీరోయిన్‌గా నటించేంత అందంగా శిల్పా ఉన్నారు. మరో పదేళ్లు అయినా శిల్ప అందం ఏమాత్రం తగ్గదేమో అంటూ ఆమె అభిమానులు ఆనందంగా ఈ పోటోలను షేర్ చేస్తూ లైక్ చేస్తున్నారు. శిల్పా ఇంతటి అందంతో ఎందుకు వరుసగా సినిమాలు చేయడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పై అయినా ఆమె నుంచి సినిమాలు వరుసగా రావాలని కోరుకుందాం.